Monday, April 29, 2024
- Advertisement -

బాబు, పచ్చ మీడియా డ్రామాలను తెలంగాణా సీమాంధ్ర ఓటర్లు ఏ స్థాయిలో ఛీ కొట్టారంటే?

- Advertisement -

తెలంగాణాలో చంద్రబాబు ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. అంతకంటే కూడా ఆశ్ఛర్యపరుస్తున్న విషయం ఏంటంటే చంద్రబాబును సీమాంధ్ర ఓటర్లు చీ కొట్టిన వైనం. సీమాంధ్రులకు చంద్రబాబుపై ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో తెలంగాణా ఎన్నికలతో చాలా స్పష్టంగా అర్థమైపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన జరిగిన హైటెక్ సిటీ సైబర్ టవర్స్ తన క్రెడిట్ అని చెప్పుకున్న చంద్రబాబును అదే హైటెక్ సిటీ ఓటర్లు డిపాజిట్ కూడా దక్కని తక్కువ స్థాయి ఓట్లతో తిప్పికొట్టారు.

ఇక నందమూరి సుహాసిని ఓడిపోతే తాను ఓడిపోయినట్లే అనేంత స్థాయిలో ప్రచారం చేసి, సుహాసిని గెలుపు ఖాయం, మెజార్టీ కోసమే అనే రేంజ్‌లో రెచ్చిపోయి మరీ కూకట్‌పల్లిలో రోజుల తరబడి ప్రచారం చేసిన చంద్రబాబుకు ముప్ఫైవేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ని గెలిపించిన కూకట్‌పల్లి సీమాంధ్రులు షాకిచ్చారు. హైదరాబాద్ పరిధిలో కనీసం ఒక్క సీటు కూడా టిడిపికి దక్కలేదంటే సీమాంధ్రులు టిడిపిపైన, చంద్రబాబుపైన ఎంత కోపంగా ఉన్నారో అర్థమవుతోంది. 2014 ఎన్నికల్లో ఆరువందల హామీలతో వంచించడం, అమరావతి పేరుతో దోచుకుంటున్న వైనం, ఇసుక నుంచీ నీళ్ళు, మట్టితో సహా అన్నీ దోచుకుంటూ ఉన్న చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతల అవినీతితో సీమాంధ్రులు ఏ స్థాయిలో పూర్తిగా విసిగిపోయారో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రులు టిడిపిని, చంద్రబాబును అస్సలు పట్టించుకోకపోవడంతోనే విశ్లేషకులకు పూర్తిగా విషయం అర్థమైంది.

బాబు చెంచాలయిన లగడపాటి, పచ్చ మీడియా జనాలను పక్కన పెడితే ఆల్రెడీ జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా జగన్ గెలుపు ఖాయం అని ఢంకా భజాయించి చెప్పేస్తున్నాయి. తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుపై సీమాంధ్రులకు ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో తెలిసిపోవడంతో ఇప్పుడు ఆ సర్వేలన్నీ వాస్తవమే అని టిడిపి నాయకులు కూడా అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాలు ఈ సారి చంద్రబాబుకు కనీసం ప్రతిపక్ష స్థానం అయినా కట్టబెడతారా? లేదా? అన్న అనుమానాలు స్వయంగా టిడిపి జనాల నుంచే వినిపిస్తూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -