Monday, May 13, 2024
- Advertisement -

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మానం ఆల‌స్యం వెనుక బాబు మాస్ట‌ర్ ప్లాన్‌..

- Advertisement -

టీడీపీ ఏపీలో శాశ్వ‌త పార్టీ కార్యాల‌యం నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. దీనిలో భాగంగా ఈ నెల26న మంగళగిరిలో నిర్మించతలపెట్టిన టీడీపీ రాష్ట్ర ఆఫీస్ ను ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ కార్యాలయం మీద ఉన్న శ్ర‌ద్ద రాజ‌ధాని నిర్మానం మీద లేకుండా పోయింది. ఏమ‌న్నంటె గ్రాఫిక్స్ డిజైన్లు చూపించి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డం త‌ప్ప మ‌రొక‌టి లేద‌నేది వాస్త‌వం.

రాజ‌ధాని విష‌యంలో మూడున్న‌ర్ర సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’కి సంబంధించి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు పనులు ఇంత వరకూ అడుగు ముందుకు పడలేదు. ఇవి వచ్చే ఏడాది మొదట్లో తప్ప ప్రారంభం అయ్యే అవకాశం కన్పించటం లేదు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలు నిర్మించినా అత్యంత లోపభూయిష్టంగా…నాసిరకంగా ఈ భవనాలు నిర్మించి సర్కారు అభాసుపాలు అయింది. ఇఫ్పటికీ ఇంకా వెలగపూడి సచివాలయ భవనాల్లో మరమ్మత్తులు సాగుతూనే ఉన్నాయి.

మూడున్నరేళ్లు పూర్తయినా కనీసం రాజధానికి సంబంధించిన కీలక భవనాల డిజైన్లు కూడా సిద్ధం చేయకుండా జాప్యం చేసినా చంద్రబాబే ఇప్పుడు అధికారులపై ఆగ్రహం అని ప్రకటించటం ద్వారా తప్పంతా అధికారులపై నెట్టేసే ప్రయత్నం ప్రారంభించారు. అయితే రాజధాని నిర్మాణాలకు సంబంధించి విపరీత జాప్యం చేయటం వెనక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

నంద్యాల ఫార్ములానె ఇక్క‌డ కూడా ఉప‌యోగించుకోవాల‌ని చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌. నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో అభివృద్ధిపేరుతో ప‌నులు మొద‌లు పెట్టి ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌నుల‌ను పూర్తి చేయ‌లంటె టీడీపీని గెలిపించాల‌ని ప్ర‌చారం చేసి త‌మ అభ్య‌ర్తిని గెలిపించుకున్నారు. రాజ‌ధాని విష‌యంలో కూడా అదే స్ట్రాట‌జీని ఫాలోఅవ‌నున్నార‌నె వార్త‌లు సొంత పార్టీ నేత‌ల‌నుంచి వినిపిస్తున్నాయి.

అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌నులు మొద‌లు పెట్టి వాటిని పూర్తి చేయాలంటె మ‌ళ్లీ త‌మ‌ను గెలిపించాల‌ని మొస‌లి క‌న్నీరు కార్చ‌డంలో సందేహంలేదు. దీనిక తోడుకేంద్రం సరిగా నిధులు ఇవ్వకపోయినా తామే కష్టపడి ఏదో చేస్తున్నామని కలరింగ్ ఇచ్చుకోవటం మరో ఎత్తుగా ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాల‌యంపై ఉన్న శ్ర‌ద్ద‌లో ప‌దిశాతం అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మానంపై పెడ్తే బావుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -