Tuesday, May 14, 2024
- Advertisement -

త్రిముఖ పోరు త‌ప్ప‌దా…?

- Advertisement -

2018 లోనె దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్‌డీఏ గ‌వ‌ర్న‌మెంట్ సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికె ఆ దిశ‌గా సంకేతాలు పంపింది. ఇప్ప‌టికె రెండు తెలుగు రాష్ట్రాలలోని పార్టీలు ఎన్నిక‌లు స‌ద్ద‌మ‌ని సంకేతాలు పార్టీ నాయ‌కుల‌కు,కార్య‌క‌ర్త‌ల‌కు పంపింది. తెలంగాణాలో టీఆర్ఎస్‌కు ఎదుర‌లేదు. ఇక ఏపీలోనె ఎన్నిక‌లు కురుక్షేత్ర మ‌హాసంగ్రామాన్ని త‌ల‌పించ‌నున్నాయి. నువ్వా,నేనా అన్న రీతిలో అన్ని పార్టీలు ఎన్నిక‌ల‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఏపీలో ముక్కోణ‌పు ర‌స‌వ‌త్త‌ర పోటీ జ‌ర‌గ‌నుంది. 2014 ఎన్నిక‌ల్లో భాజాపా-టీడీపీకి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్ ఇప్పుడు ఇప్పుడు ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పార్టీల ప‌రిస్థితులు చూసుకుంటె ప్ర‌స్తుత అధికార పార్టీ టీడీపీపై ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త ఉన్నా ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ప్ర‌స్తుతానికి ప‌దిలంగానె ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు. ఒక వేల ప‌వ‌న్ పోటీ చేస్తె ఆపార్టీ ఓటు బ్యాంక్ భారీగా చీలె అవ‌కాశం లేక‌పోలేదు.

ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తె జ‌గ‌న్‌మీద అభిమానం ఉన్నా పాల‌న ఎలా చేస్తార‌నె స్పష్టమైన అభిప్రాయం లేదు. దాంతో ఆ పార్టీలో కూడా జగన్ స్థాయిలో సమర్ధంగా పని చేసే నాయకులు కనిపించడం లేదు. మొన్న జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల తర్వాత ఆ పార్టీ డీలా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దాంతో పార్టీ భ‌విష్య‌త్తుపై నీలినీడ‌లు క‌మ్ముకోవ‌డంతో పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

అలాగే ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపించడంలో, వాటి మీద ప్రజల ద్రుష్టి పడేలా చేయడంలో వైసీపీ దారుణంగా విఫలం అయ్యింద‌ని చాలా మంది విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌జ‌ల అభిమానం ఉన్నా వాటిని ఓట్లుగా మ‌లుచుకోవ‌డంతో పార్టీ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యింద‌నె చెప్పాలి. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తగా పీకెను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించినా ఆ పార్టీ ఇంకా పూర్తి స్థాయి నిర్మాణం జరగలేద‌నేది వాస్త‌వం. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత చెప్పుకోదగ్గ లీడర్స్ ఎవరంటే ఎవరికి తెలియదు. స‌భ‌లు,స‌మావేశాల్లో ప‌వ‌న్ ఒక్క‌డే ఐకాన్‌గా ఉన్నారు. ప్రజలకి పవన్ కళ్యాణ్ మీద ఒక పాజిటివ్ వైబ్ ఉన్న అది ఎంత వరకు గెలిపిస్తుంది అనేది చెప్పలేని విషయం.

నిన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ మాతోనె ఉంటార‌ని చెప్పుకున్న టీడీపీకి ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. మంత్రులు పితాని, అశోక్‌గ‌జ‌ప‌తిరాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ సీరియ‌స్‌గా స్పందించారు. దీంతో ప‌వ‌న్ ఒంట‌రిపోరుకే సిద్ద‌మ‌య్యారు. పార్టీలు ఒక‌రితో ఒక‌రు పొత్తుపెట్టుకున్నా,పెట్టుకోక‌పోయినా త్రిముఖ పోరు జ‌ర‌గ‌డం త‌థ్యం. త్రిముఖ పోరులో ఎవ‌ర‌కు అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -