Tuesday, May 14, 2024
- Advertisement -

అసమర్థుల, ద్రోహుల చేతిలో ఉన్న భ్రష్టుపట్టిపోయిన పార్టీ టీడీపిః మోత్కుపల్లి

- Advertisement -

ఎన్నో ఆశయాలు….. చిత్తశుద్ధి… మొండి పట్టుదలతో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్న పార్టీకి అస్సలు పోలికే లేదన్న విషయం నిజం. పార్టీని స్థాపించిననాటి నుంచీ కూడా యువకులు, విద్యావంతులకు పెద్ద పీట వేశాడు ఎన్టీఆర్. కానీ చంద్రబాబు మాత్రం వ్యాపారస్తులను మాత్రమే ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. భజన మీడియాను మాత్రం బలంగా ఏర్పాటు చేసుకుని అధికారం కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. సుజనా చౌదరి, గల్లా జయదేవ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు మినహా చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నందమూరి వారసుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వడు చంద్రబాబు. ఇక యనమలతో సహా ఇతర సీనియర్ నాయకులందరూ కూడా చంద్రబాబు, లోకేష్‌ల అడుగులకు మడుగులొత్తడమే. ఇవే కఠిన వాస్తవాలను ఆవేదనతో చెప్పుకొచ్చాడు మోత్కుపల్లి.

సమున్నత ఆశయాలతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు భ్రష్టుపట్టి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటుకు కోట్లుతో టిడిపి నైతికంగా పాతాళానికి దిగజారిపోయిందని చెప్పాడు. కనీసం రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసి ఉన్నా కొంత పరువు మిగిలేదని…..బాబు ఆ ధైర్యం కూడా చేయలేకపోవడంతో టిడిపి పతనమైందని చెప్పుకొచ్చాడు. నీతిమాలిన, బజారు మనుషులను చంద్రబాబు ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు పార్టీ నడిపిస్తున్న విధానం……టిడిపిలో అసమర్థులు, నీతిమాలిన, బజారు స్థాయి మనుషులను బాబు ప్రోత్సహిస్తున్న విధానంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడిపెట్టారు మోత్కుపల్లి నరసిహింహులు. నా జీవితాన్ని బలిచేసి, ఉరితాడు వేసుకుని మరీ చంద్రబాబుకు అండగా నిలబడ్డాను కానీ నా త్యాగాలకు విలువ లేకుండా పోయిందని బాబు వ్యక్తిత్వం గురించి కూడా విమర్శలు చేశాడు మోత్కుపల్లి. అయితే చివరగా మాత్రం చంద్రబాబు మారితే…..పార్టీ కోసం గట్టిగా నిలబడితే మళ్ళీ పార్టీ సమున్నతస్థాయికి వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే అప్పటికే మోత్కుపల్లి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హాజరైన జర్నలిస్టుల్లో ఎక్కువ మంది అన్నీ నిజాలే చెప్పారని ప్రెస్ మీట్ అయ్యాక మోత్కుపల్లిన అభినందించడం గమనార్హం. చంద్రబాబుతో సావాసాన్ని ఉరితాడుతో పోల్చిన మోత్కుపల్లి అనుభవం తర్వాత కూడా టిడిపి నాయకులు చంద్రబాబుని నమ్మగలరా? అసలు ఇప్పుడు ఉన్న నాయకులు బాబుని నమ్మే పార్టీలో కొనసాగుతున్నారా? అధికారం ఉన్నదని పార్టీలో ఉన్నారా? అన్న చర్చలు ప్రెస్ మీట్లో వచ్చాయి. అందరూ కూడా ఈ సారి టిడిపి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు పక్కన సత్తా ఉన్న ఒక్క నాయకుడు కూడా నిలబడే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం గమనార్హం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు…….అధికారం పదవి కోసం వెన్నుపోటు పొడవడం, నాయకులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో కూడా వాడుకోవడం….వదిలెయ్యడం తరహాలో కాకుండా కాస్త నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండదని జర్నలిస్టులు చర్చించుకోవడం కనిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -