Sunday, May 5, 2024
- Advertisement -

త్వ‌ర‌లో జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసులు అన్నీ వీగిపోతాయా….?

- Advertisement -

వైసీపీ, జ‌గ‌న్‌పై కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవి ఇప్పుడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ నంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అంటూనే.. మరోవైపు వైసీపీ రాకపై సానుకూలంగా స్పందించారు. వైకాపా కూడా ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీ అని.. ఎన్డీయేలో చేరాలని ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆహ్వానిస్తున్నానని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు సమంజసంగా లేదని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. అట్రాసిటీ కేసుకు సంబంధించి భాజపా కూడా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని.. మిగిలిన కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

ఇక జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల‌గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్‌పై ఉన్న కేసుల్లో ఏవీ ఇంకా నిరూపితం కాలేదని రాందాస్‌ అథవాలే చెప్పుకొచ్చారు. గ‌తంలో కాంగ్రెస్ , టీడీపీ కుమ్మ‌క్కౌ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే జ‌గ‌న్‌ప‌పై అక్ర‌మ కేసులు పెట్టార‌ని తెలిపారు.

భాజాపాతో వైసీపీ లోపాయికార ఒప్పందం చేసుకున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. నాడు బీజేపీతో క‌ల‌వ‌ను అన్న చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల్లో అధికారం కోసం మోదీ వెంట వెళ్లారు… ఇక కాంగ్రెస్ కు ర‌హ‌స్యంగా సాయం చేస్తున్నారు అనే విమ‌ర్శ‌లు నేడు వినిపిస్తున్నాయి… ఇక ఇలాంటి రాజ‌కీయం చంద్ర‌బాబుకు మాత్ర‌మే తెలుసు అని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్ర‌స్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతోనే కేంద్రం ఏపీని పట్టించుకోవట్లేదన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలకు రాందాస్‌ అథవాలే కామెంట్లు బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -