Saturday, May 4, 2024
- Advertisement -

బాబుకు చుక్క‌లే…

- Advertisement -

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల మ‌డుగులో ఇద్ద‌రి నేత‌ల మ‌ద్య క‌థ క్లైమాక్స్‌కు చేరింది. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విబేధాలు మ‌రో సారి బ‌గ్గుమ‌న్నాయి. మంత్రి ఆదినారాయణరెడ్డి-ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మొదలైన ఆధిపత్య పోరాటం చివరకు పార్టీ పుట్టిముంచటం ఖాయంగా తోస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్యకు చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నిచినా సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికల్లోగా ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరే పార్టీలో ఉండే పరిస్ధతి స్పష్టంగా కనిపిస్తోంది.

ఇద్ద‌రి కుటుంబాల మ‌ధ్య ఉన్న వైరం తెల‌సిందే. అన్నీ తెలిసి వైసీపీ త‌రుపున గెలిచిన ఆదానారాయ‌ణ‌రెడ్డిని టీడీపీలో చేర్చుకొని మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. మొద‌ట‌నుంచి రామ‌సుబ్బారెడ్డి పార్టీలోకి ఆది వ‌ద్ద‌ని విన్న‌వించినా బాబు అవేవి ప‌ట్టించుకోలేదు. రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి తాత్కాలికంగా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు స‌ద్దుమ‌నిగేలా చేశారు.

ప్రేమాభిమానాలుచంద్ర‌బాబుడిక్షనరీలోనేలేవు.ఉన్న‌ద‌ల్లానాయ‌కుల‌నుఅవ‌స‌రానికివాడుకోవ‌డం..ప‌నికిరాడ‌నుకుంటె వ‌దిలించుకోవ‌టం బాబుకు అల‌వాటె.ఇప్పుడు టీడీపీలో రామ‌సుబ్బారెడ్డి ప‌రిస్థితి కూడా అదే విధంగా త‌యార‌య్యంది. జమ్మలమడుగు ఏపి వైద్య విదాన పరిషత్ పాలక మండలి ఛైర్మన్ పోస్టు ఇద్దరి నేతల మధ్య తాజాగా చిచ్చు పెట్టింది. ఛైర్మెన్ ప‌ద‌వి మాకంటె మాక‌ని ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య అధిప‌త్య‌పోరు మొద‌ల‌య్యింది.

ఛైర్మన్ గా తన కొడుకే బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రి బహిరంగంగా ప్రకటించి రెండు వర్గాల మధ్య కాక రేపారు. రెండు వర్గాలూ గతంలో ఒకరిపై మరొకరు దాడులు కూడా చేసుకున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ఇద్ద‌రూ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

రామసుబ్బారెడ్డి సోదరి హైమవతి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో పోటీ చేసే అవకాశం తన సోదరునికి ఇవ్వకపోతే పార్టీలో కొనసాగే విషయమై ఆలోచించుకోవాల్సి వస్తుందని ఏకంగా చంద్రబాబునాయుడుకే హెచ్చరికలు పంపటంపై తీవ్రంగ చర్చ జరుగుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్నార‌న్న వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. స‌మ‌యం చూసుకొని రామసుబ్బారెడ్డి టిడిపిని వీడటం ఖాయమనే అనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -