కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.కాపులు ఎక్కువగా ఉండే జగ్గంపేటలో రిజర్వేషన్ల అంశం నా పరిధిలో లేదని కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడు రాజకీయాలు మరో వైపు తిరుతున్నాయి. జగన్‌పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేశారు. ఓకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు కాపు రిజర్వేషన్లపై జగన్ తీసుకున్న నిర్ణయం పవన్, బాబు ఆత్మరక్షణలో పడ్డారు.
జగన్ వ్యాఖ్యలు ముద్రగడను కూడా ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉందని, కాపులు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని గ్రహించకుండానే జగన్ ఆ ప్రకటన చేశారా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నీ తెలిసికూడా జగన్ ఆప్రకట వెనుక భారీ వ్యూహమే ఉందనేది ఆలోచించాల్సిన విషయమే.
జగన్ వ్యాఖ్యల వెనుక రెండు ప్రధాన కారనాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తూతూ మంత్రంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఓ వైపు ఉండగా, అదనపు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం తనకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే స్పష్టం చేసింది.
యాభై శాతం రిజర్వేషన్లలోనే కాపు రిజర్వేషన్లను చేర్చాలంటే ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించాల్సి ఉంటుంది. అందుకు బీసీలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అందువల్ల కాపులకు రిజర్వేషన్లను అమలు చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదని అందరికీ తెలిసిందే.
చేయగలిగేది మాత్రమే చెబుతారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జగన్ అనుకుని ఉంటారు. మరో పైపు రిజర్వేషన్లపై టీడీపీనీ పెట్టేందుకు పవన్‌పై జగన్ ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా… అనేది కూడా చర్చ జరుగుతోంది.
రెండో విసయానికి వస్తే పవన్ కళ్యాణ్‌ను కూడా పూర్తిగా ఆత్మరక్షణలో పేడేసింది. జగన్ ప్రకటన వల్ల పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అనివార్యతలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్ల విషయంలో తాను ఏం చేస్తాననే విషయాన్ని ఆయన చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా స్పష్టమైన ప్రకటనను పవన్ చేయకతప్పదు.
కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటన తర్వాత వచ్చిన రియాక్షన్స్ చూసి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటన చేసేందుకు సాహసిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి…బీసీలను దూరం చేసుకొనే సహాసం చేస్తారా లేకుంటే బాబుపై ఒత్తిడి తీసుకు వస్తారా అన్నది ప్రశ్న మేధావుల్లో తలెత్తుతోంది. పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి.
