Sunday, May 19, 2024
- Advertisement -

రాజకీయ స్వార్థంతోనే మోడీకి కటీఫ్ చెప్పిన చంద్రబాబుః ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

- Advertisement -

చంద్రబాబు తప్పులను సమర్థించడానికి నానా పాట్లూ పడుతోంది టిడిపి భజన మీడియా. ఇక చంద్రబాబును లోకోత్తమ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు దానికి అదనం. అన్నింటికీ మించి చంద్రబాబుకే నమ్మకంలేని లోకేష్‌ నాయకత్వ లక్షణాలు, సమర్థతను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మేలా చేయడం తలకు మించిన భారం అవుతోంది. ఇక రోజు రోజుకూ ప్రజాదరణ పెంచుకుంటున్న జగన్‌ విశ్వసనీయతను దెబ్బతీయడం, వ్యక్తిత్వాన్ని హరించడం కూడా పచ్చ మీడియాకు సాధ్యం కావడం లేదు. ఇన్ని బాధ్యతల నేపథ్యంలో బాబు బ్యాచ్ మీడియా జనాలు తడబడుతున్నారు. బాబు లోపాలను వాళ్ళే బయటపెట్టేస్తున్నారు.

ఒకవైపు చంద్రబాబేమో నాకు ఏ స్వార్థమూ లేదు, అధికార యావ అసలే లేదు….ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. 2014లో మోడీతో పొత్తు పెట్టుకున్నదీ……ఇప్పుడు మోడీతో తెగతెంపుల డ్రామా నడిపిస్తున్నది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని ప్రజలను నమ్మించడానికి నానా అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అయితే చంద్రబాబు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని బాబు సన్నిహితుడు, బాబు సహకారంతో బాబు భజన కోసమే ఆంధ్రజ్యోతి మీడియాను నడుపుతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తేల్చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నియోజకవర్గాలను పెంచాలని చంద్రబాబుగారు మోడీని అడిగారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రైల్వే జోన్ లేకపోయినా నేను మేనేజ్ చేస్తా……సీట్ల పెంపు మాత్రం తప్పకుండా చేయాల్సిందే అని మోడీని అడిగాడు. అయితే మోడీ మాత్రం బిజెపికి 10 ఎంపి సీట్లు, 50 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే సీట్ల పెంపు నిర్ణయం తీసుకుంటానని మోడీ అన్నాడు. మోడీ ఇచ్చిన షాక్‌తో చంద్రబాబుకు దిమ్మతిరిగింది. అసలు బలమే లేని బిజెపికి ఆ స్థాయిలో సీట్లు ఇస్తే జగన్ గెలుపు ఖాయం అన్న భయం…….అన్నింటికీ మించి ఇప్పటికే పూర్తి ఆధిక్యంలో ఉన్న మోడీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 ఎంపి సీట్లను గెలిపిస్తే అసలు తనను కేర్ చేయడు అన్న భయంతో మోడీతో తెగదెంపులకు సిద్ధపడ్డాడు చంద్రబాబు.

ఈ మొత్తం విషయాలను తన కాలంలో పూసగుచ్చినట్టు వివరించుకొచ్చాడు రాధాకృష్ణ. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఎక్కడైనా ఉందా? మళ్ళీ అధికారంలోకి రావాలన్న చంద్రబాబు స్వార్థం, అధికార యావ తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా? బిజెపికి చంద్రబాబు కటీఫ్ చెప్పడం వెనుక అసలు కారణం ఇదే. కానీ చంద్రబాబు మాత్రం 2019 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటూ………తాను స్నానం చేసినా, స్నానం చేయకున్నా, మనవడిని కలిసినా, కలవకపోయినా……అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే అనే స్థాయిలో అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు. తాను బలహీన పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలహీనపడుతుందని చంద్రబాబు చెప్పడం మాత్రం ఈ అతికి మరీ పరాకాష్ట. విభజన సమయంలోను, విభజన తర్వాత నుంచీ కూడా బలంగా ఉండి చంద్రబాబు సీమాంధ్రను ఉద్దరించింది ఏంటట?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -