- Advertisement -

అఖిల ప్రియ తెలుసుకో…

- Advertisement -

వైసీపీ ఫైర్ బ్రాండ్ మ‌హిళా ఎమ్మెల్యే రోజా చంద్ర‌బాబు,మంత్రుల‌పై నిప్పులు చెరిగారు.చంద్రబాబు నాయుడు హెచ్చరించిన మరుసటి రోజే వైయస్ రాజశేఖర రెడ్డి గారి ప్రాణాలు గాలిలో కలిశాయని రోజా అన్నారు.తనతో పెట్టుకున్న వారు ఎవరూ బతికి బట్ట కట్టలేదని చంద్రబాబు అన్నారని రోజా అగ్రహించారు.

ప‌నిలో ప‌నిగా అఖిల‌నుకూడా దుమ్ముదులిపారు.ఆమెను నేను సూటిగా అడుగుతున్నానని, శోభా నాగిరెడ్డిని వైసిపి మొత్తం గౌరవిస్తోందని, కానీ మీరు ఆమె ఆశయాలకు ఎందుకు తూట్లు పొడిచారని ప్రశ్నించారు. శోభా పీఆర్పీ నుంచి వచ్చినప్పుడు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారని చెప్పారు. ఇప్పుడు తల్లి ఆశయాలను ఆమె తుంగలో తొక్కారన్నారు

మీ తండ్రి భూమా నాగిరెడ్డి చావుకు చంద్రబాబు కారణమని రోజా ఆరోపించారు. అఖిలప్రియా తెలుసుకో.. మీ నాన్న భూమా నాగిరెడ్డిని చేయని తప్పుకు 14 రోజులు ఈ ప్రభుత్వం జైల్లో పెట్టిందన్నారు. రౌడీషీట్ తెరిచిందన్నారు. ఈ విషయాలు తెలుసుకోవాలన్నారు.

చంద్రబాబు నాయుడు వేసే ఎంగిలి మెతుకుల మీ తల్లిదండ్రుల ఆశయాలను పక్కన పెడతావా అని అఖిలప్రియను రోజా ప్రశ్నించారు.చంద్రబాబు ఎంత నీచుడో చెప్పాలా అని రోజా ధ్వజమెత్తారు. నడిరోడ్డుపై వంగవీటి రంగాను హత్య చేయించారన్నారు. రాజారెడ్డిని చంపిన వారికి ఆశ్రయం ఇచ్చారన్నారు. రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చంద్రబాబువే అన్నారు.

జగన్‌ను తిట్టడానికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని రోజా విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ముందు రాజీనామా చేసి, ఆ తర్వాత మాట్లాడాలన్నారు. కేశవ రెడ్డి బాధితులకు న్యాయం చేయాలని సవాల్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -