Tuesday, May 14, 2024
- Advertisement -

సిట్‌ నివేదికను సీల్డ్‌ కవర్లో కోరిన హైకోర్టు…విచార‌ణ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా

- Advertisement -

తనపై జరిగిన దాడిపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేప‌ట్టింది. కేసులో వాదోపవాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో సిట్ అధికారుల పురోగతి నివేదికను సీల్డ్ కవర్ లో మంగళవారం కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

ఈ ఘటనపై జగన్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే 161 సీఆర్పీసీ పోలీసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించలేదని ఆయన తరుపు న్యాయవాదిని కోర్టును ప్రశ్నించింది. దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఘటన జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబరాద్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. అయితే ఏపీ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, అందుకే విచారణకు అంగీకరించలేదని ఆయన బదులిచ్చారు.స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థతో దీనిపై విచారణ జరిపించాలని ఆయన కోర్టుకు విన్నవించారు.

పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆపేక్షించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ తరపు న్యాయవాది.. ప్రాణాపాయం ఉందనే కారణంతోనే స్టేట్ మెంట్ ఇవ్వలేద‌ని తెలిపారు.

దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను సీల్డ్‌కవర్‌లో అందజేయాలని ఏపీ పోలీసులను కోర్టు ఆదేశించింది. జగన్‌పై దాడికి సంబంధించి ఇప్పటివరకు సిట్ చేసిన విచారణను మంగళవారం నాటికల్లా సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -