Thursday, May 2, 2024
- Advertisement -

జగన్ అవినీతి పరుడు అంటున్న పవన్ నువ్వు చూశావా …? జ‌గ‌న్‌

- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా అధికార పార్టీ టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబును ఒక్క మాట అన‌కుండా వైఎస్ జ‌గ‌నే టార్గెట్‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఎక్క‌డైనా అధికార పార్టీ టీడీపీనీ విమ‌ర్శలు చేయ‌డం ప్ర‌తిప‌క్షాలు చేసే ప‌ని. కాని ఏపీ దౌర్భాగ్యం ఏంటో గాని ఇక్క‌డ ప్ర‌తిప‌క్షం మీద …ప్ర‌తిప‌క్ష‌మే విమ‌ర్శ‌లు చేయ‌డం అల‌వాటుగా మారింది. తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.

జా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ సోమవారం(డిసెంబరు 3) కొర్లవ‌ల‌స, గుర‌వాం మీదుగా రాజాం చేరుకున్నారు. దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ సాగిన ప్రతిపక్ష నేత వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈడీ విద్యార్థినులు జగన్‌ను కలిశారు. ప్రభుత్వం డీఎస్సీని పదే పదే వాయిదా వేస్తోందని, పోస్టుల్లో కోత విధిస్తోందని వారు జగన్‌కు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏటా మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అనంత‌రం రాజాంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

మ‌రో సారి ప‌వ‌న్ బాబు పార్టన‌ర్ అంటూ ఆరోపించారు. ప‌వ‌న్ న‌టించిన అజ్ణాత‌వాసి సినిమాకు బాబు అనేక రాయితీలిచ్చార‌ని…దాంట్లో కోట్లు సంపాదించుకున్న‌ది అవినీతి సొమ్ము కాదా ప‌వ‌న్ అని ప్ర‌శ్నించారు. నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిలోనూ, మోసంలోనూ, తప్పుడు నిర్ణయాల్లోనూ, అరాచక పాలనలోనూ పవన్ కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. నాలుగు సంవ‌త్స‌రాలు బాబు సంసారం చేసి ఇప్పుడు స‌రికొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని విమ‌ర్శించారు.

చంద్రబాబు స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేస్తే పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సినిమాకు లింగమనేనని నిర్మాత అంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇంటర్వేల్ ఎక్కువ సినిమా తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పేమెంట్లు చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఇస్తాడంటూ ఎద్దేవ చేశారు.

జగన్ అవినీతి పరుడు అంటున్న పవన్ నువ్వు చూశావా నా అవినీతి అంటూ ప్రశ్నించారు. పవన్ రాజకీయాల్లోకి రాకముందే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలన జరిగిందన్నారు. అలాంటిది వైఎస్ పై కూడా మాట్లాడతాడంటూ విమర్శించారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న గురించి ఏం తెలుసున‌ని ప‌వ‌న్‌ని ప్ర‌శ్నించారు. గ‌త కొన్ని రోజుల‌గా ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు జ‌గ‌న్ తిప్పికొట్టార‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -