- Advertisement -

చంద్ర‌బాబు డ్రామాలు న‌మ్మొద్దు…వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ముగిసింది. ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన స‌భ‌కు జ‌నాలు పోటెత్తారు. బ‌హిరంగ స‌భ‌లో బాబు దుర్మార్గ‌క‌పు రాజ‌కీయాల‌ను ఎండ‌గ‌ట్టారు. బాబు రంగులు మార్చ‌డంలో ఊస‌ర‌వల్లిని మించిపోయార‌న్నారు. నాలుగేళ్లుగా భాజాపాతో కాపురం చేసి విడాకులు తీస‌కోగానే …ప్ర‌త్యేక హోదా కోసం దొంగ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

త‌న‌కున్న రెండు ప‌త్రిక‌లు, ఎల్లో మీడియాతో గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ.. హోదా కోసం పోరాతుడున్నట్లు బిల్డప్ ఇస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొని వారిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వు లిచ్చిన ఘ‌న‌త బాబు ద‌న్నారు. తెలంగాణాలో ఎన్నిక‌ల్లో పార్టీ మారిన నేత‌ల‌ను ఓడించాల‌ని పిలుపు నిస్తారు. ఊస‌రవెల్లి కంటే వేగంగా రంగులు మార్చుతార‌ని ఎద్దేవ చేశారు.

భాజాపాతో నాలుగేళ్లుగా క‌ల‌సి ఉన్న‌ప్పుడు హోదాను తుంగ‌లోకి తొక్కారన్నారు. ఎన్నిక‌లు వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాపై నాట‌కాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఎవరైనా హోదా పేరు చెబితే జైల్లో పెట్టిస్తానంటారు.. అదేమైనా సంజీవనా అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఈ నాలుగేళ్లలో కేంద్రం ఏ రాష్ట్రానికి చేయని విధంగా సాయం చేసిందని అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. నాలుగేళ్లు చిలకా గొరింకల్లా కాపురం చేసి.. తీరా ఎన్నికలు వచ్చేసరికి డ్రామాలు మొదలు పెడతారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -