నలభై ఏళ్ళ అనుభవజ్ఙుడు చంద్రబాబేమో అనుక్షణం భయపడుతూ, ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నాడు. కానీ జగన్ మాత్రం అత్యంత చాకచక్యంగా 2019 ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్దుడవుతూ ఉన్నాడు. వైకాపాకు ఎందుకు ఓటు వెయ్యాలి? జగన్‌ని ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అనే ప్రశ్నలకు అనుక్షణం ప్రజల మధ్య ఉంటున్న ఏకైక నాయకుడిని నేనే అని చేతలతోనే సమాధానం చెప్తున్నాడు జగన్. పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ ఇప్పటివరకూ కూడా గెలిపించినా, గెలిపించకపోయినా ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉన్న నాయకుడు మాత్రం జగన్ ఒక్కడే. మొత్తం భారతదేశంలో కూడా జగన్ స్థాయిలో ప్రజల మధ్య ఉన్న నాయకుడు మరొకరు కనిపించరు.
అయితే ప్రజల సమస్యల కోసం పోరాడడం, ప్రజల మధ్య ఉండే విషయాల్లో 2014ఎన్నికల సమయానికే నిరూపించుకున్నాడు జగన్. అయితే చంద్రబాబు రాజకీయాలను, వ్యూహాలను, కుట్రలను ఎదుర్కోవడంలో మాత్రం 2014ఎన్నికల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ సారి మాత్రం చంద్రబాబుకు పర్ఫెక్ట్ కౌంటర్స్ ఇస్తున్నాడు. న్యాయవ్యవస్థలో కూడా బాబుపై విజయం సాధించగలనని తాజాగా టిడిపి ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు అన్న తీర్పుతో నిరూపించుకున్నాడు జగన్. 18స్టేలతో అరెస్టులు తప్పించుకుంటూ మేనేజ్ చేస్తున్న చంద్రబాబుకు ఇది నిజంగా షాకింగ్ విషయమే. అలాగే వైకాపాలో ఉన్న బాబు కోవర్టులను కూడా సైలెంట్‌గా పార్టీ నుంచి సాగనంపేస్తున్నాడు జగన్. సస్పెన్షన్ తర్వాత కొండపి నేత వరికూటి అశోక్బాబులాంటి నాయకులు నిరాహారదీక్ష అంటూ హంగామా చేస్తూ వైకాపాపైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ జగన్ మాత్రం బెదరడంలేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో చంద్రబాబును ఎదుర్కునే విషయంలోనూ, అలాగే చంద్రబాబు కోవర్టు రాజకీయాల కుట్రలను ఎదుర్కునే విషయంలో ఇప్పుడు జగన్ సాధిస్తున్న పరిణతిని విమర్శకులను కూడా మెప్పిస్తోంది. నాయకుడిగా జగన్ తనను తాను అన్ని విధాలుగా నిరూపించుకున్నాడని విద్యావేత్తలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
