వైఎస్ జగన్ 2019లో జరిగే ఎలెక్షన్స్‌లో ఎట్టి పరిస్థితులలో సీఎం కావాలనే ఆశతో , గత 7 నెలలుగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నాడు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత,అవినీతి ఆరోపణలు తనను అధికారంలోకి తీసుకువస్తాయి అని జగన్ భావిస్తున్నాడు. 2014లో జరిగిన ఎలెక్షన్స్‌లో తృటిలో అధికారం కొల్పోయిన జగన్‌కు ,వచ్చే ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే జగన్‌కు అవకాశాలు బాగానే ఉన్నాయి.
అయితే ఈ పరిస్థితులు చంద్రబాబు ముందు పనికి వస్తాయా అనేది అనుమానమే. ఎలెక్షన్స్ టైంలో చంద్రబాబు ఆలోచనలను అంచనా వేయాడం, వారి పార్టీ నాయకులకు కూడా కష్టతరమే. పోల్ మెనేజ్మెంట్‌లో చంద్రబాబుని మించిన వారు లేరని ఉండవల్లి అరుణ్ కూమార్ వంటి సీనియర్ నాయకులు ఇప్పటికే ప్రత్యర్థిని హెచ్చరించారు కూడా. ఇది నంద్యాల ఉప ఎన్నికలప్పుడు స్పష్టంగా కనిపిచింది. ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న సీటులో కూడా వైసీపీ ఓడిపోయింది అంటే, బాబు పోల్ మెనేజ్మెంట్ ఏ విధాంగా ఉందో అర్థం చేసుకోవాలి. మరి వచ్చే ఎలెక్షన్స్‌లో సీఎం కావాలని కలలు కంటున్న జగన్ పోల్ మెనేజ్మెంట్‌లో కొంచెం వీక్‌గానే ఉన్నాడు.
ఇప్పటికి వైసీపీకి సంస్థగతంగా బలంగా లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే పార్టీని నడపడం కష్టం. పాదయాత్రకు వస్తున్న ప్రజలను చూసి వీరి మద్దతు తమకే ఉందని జగన్ భావిస్తున్నాడు. టీడీపీకి మొదటి నుండి కేడర్ అండ పుష్కలంగా ఉంది. ఇక ఎన్నికలప్పుడు బాబు పోల్ మెనేజ్మెంట్ ఎలాగో ఉంటుంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరి బాబు పోల్ మెనేజ్మెంట్ ముందు ఎలా నిలబడతాడో చూడాలి.
