- Advertisement -

జ‌గ‌న్ ఆఫ‌ర్‌ను దాట‌వేసిన కేవీపి ఎందుకు…..? క‌న్‌ఫ్యూజ‌న్‌కు తెర‌ప‌డుతుందా…?

- Advertisement -

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నోటి ద‌గ్గ‌ర కొచ్చిన అధికారాన్ని కొద్దిలో పోగోట్టుకున్న జ‌గ‌న్ 2019 లో ఎలాగైనా సీఎం కావాల‌ని ఆశ‌ప‌డుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. సెమీఫైనల్స్‌గా భావించిన నంద్యాల ఉప ఎన్నిక‌లతో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ యం.. నైతికంగా పార్టీ ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసింద‌న‌డంలో సందేహంలేదు.

సొంత పార్టీ పెట్టి వైఎస్ఆర్‌కు స‌న్నిహితులైన సీనియ‌ర్ నాయ‌కుల‌ను దూరంచేసుకున్న జ‌గ‌న్‌కు ఇప్పుడు వారి ప్రాధాన్య‌త తెలిసిన‌ట్లుంది. అందుకే ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. త‌న తండ్రికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ ఆత్మ‌గా భావించిన‌ కేవీపీని ద‌గ్గ‌ర చేసుకునే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. ఇందు కు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా ముగిశాయ‌ని.. ఇద్ద‌రి మ‌ధ్య డీల్ ఫిక్స్ అయింద‌నే చ‌ర్చ మొద‌లైంది.

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి, కేవీపీ మ‌ధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత‌.. కేవీపీ రాజ‌కీయాల‌కు దూర‌మైపోయారు. వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ సొంత పార్టీ పెట్టుకున్నా.. అందులోకి వెళ్ల‌కుండా కాంగ్రెస్‌లోనే ఉంటున్నారు. నంద్యాల, కాకినాడ ఫలితాలు చూశాక రాజకీయంగా పెద్ద దిక్కు లేకుండా ముందుకు వెళ్లడం సరికాదని జగన్ భావిస్తున్నారు.

అందుకె వై.ఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కేవీపీ కి పిలుపు వెల్ల‌డంతో ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఇడుపులపాయ వేదికగా గురించి జగన్, కేవీపీ సుదీర్ఘంగా చర్చించుకున్నారు.`నిన్ను సీఎం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాన`ని కేవీపీ చెప్పడంతో జగన్ కు కొండంత అండ దొరిక‌న‌ట్టు అయింద‌ట. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న స్థాయి సన్నద్ధత సరిపోదని కూడా కేవీపీ స్ప‌ష్టంచేశారట‌.

పార్టీలో పెద్ద దిక్కుగా అరువు తెచ్చుకున్న వ్యక్తికి కాకుండా తన అనుకునే వాళ్లు అయితే బాగుంటుందని జగన్ కి భార్య, కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారట. ఎప్పుడూ ఇంకోరి మాట వినని జగన్ ఈసారి సరే అనడంతో పాటు వెంటనే రంగంలోకి దిగారట.

పార్టీలో చేరితె బాగుంటుంద‌ని కేవీపీ ని జగన్ అడిగారట. చేరితే రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతేగాక పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఏపీలో కీల‌క బాధ్య‌త లు ఇస్తామ‌ని కూడా వివ‌రించార‌ట‌. దానిపై నిర్దిష్ట అభిప్రాయం చెప్పకుండానే కేవీపీ మాట దాటవేశారట. జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా…? అస‌లు ఆయ‌న మ‌న‌సులో ఏముందో తెలియాలంటె కొన్ని రోజులు ఆగాల్సిందే…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -