Saturday, May 18, 2024
- Advertisement -

చంద్రబాబు పూర్తిగా తప్పు అని జాతీయస్థాయిలో నిరూపించిన జగన్

- Advertisement -

జగన్‌పై హత్యాయత్నం జరిగిన మరుక్షణం నుంచీ వైఎస్ జగన్ చాలా సంయమనం పాటిస్తున్నాడు. సంయమనం పాటించండి అని తన అభిమానులకు చెప్తూ ట్వీట్ చేయడం మినహా వేరే ఏమీ చేయలేదు. అయితే బాబు అండ్ బ్యాచ్ మొత్తం ఓ స్థాయిలో రంకెలేశారు. ఇప్పుడు పచ్చ బ్యాచ్ మాటలన్నీ పూర్తిగా దొంగమాటలని, అబద్ధాలను జాతీయ స్థాయిలో నిరూపించేశాడు జగన్. 2014 ఎన్నికల తర్వాత నుంచీ రాజకీయ ఆలోచనల విషయంలో జగన్‌లో చాలా పరిణతి వచ్చిందని చెప్తున్న రాజకీయ విశ్లేషకుల మాటలు అక్షర సత్యాలని నిరూపించాడు.

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే చంద్రబాబు అండ్ బ్యాచ్ గగ్గోలు పెట్టిన విషయాలేంటో గుర్తున్నాయి కదా……….రాష్ట్రమంతా దాడులు, ఆందోళనలు చేసి….శాంతి భద్రతలు సాకుగా చూపి తన ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని రంకెలేశాడు చంద్రబాబు. అయితే తనపై హత్యాయత్నం జరిగినప్పటికీ పూర్తిగా సంయమనం పాటించిన జగన్ మాత్రం తన అభిమానులు కూడా ఎక్కడా రెచ్చిపోకుండా అద్భుతం నియంత్రించాడు. లక్షలాది మంది అభిమానులున్న ఒక నాయకుడు ఈ స్థాయిలో ఆయన అభిమానులను కంట్రోల్ చేయడం నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో చిరంజీవి అభిమానులు, ఇప్పుడు పవన్ అభిమానులు, పరిటాల రవి చనిపోయాక టిడిపి అభిమానులు ఏ స్థాయిలో రచ్చ చేశారో, చేస్తున్నారో అందరికీ తెలిసినవిషయమే. అయితే జగన్ అభిమానులు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఇక ఈ రోజు జగన్ తరపున కేంద్ర హోం శాఖామంత్రితో సహా చాలా మంది పెద్దలను కలిసిన వైకాపా నాయకులు ఎక్కడా కూడా టిడిపి ప్రభుత్వాన్ని కూల్చాలని కోరలేదు. ఆరునెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చి ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టాలని మేం ఎందుకు ప్రయత్నిస్తామని విజయసాయిరెడ్డితో సహా వైకాపా ఎంపిలు చాలా స్పష్టంగా తేల్చిచెప్పేశారు.

ఆ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు, తన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న చంద్రబాబు మాటలనూ పూర్తిగా అబద్ధాలుగా నిరూపించేశాడు జగన్. ఇక బాబును ఏదో చేయబోతున్నారని గరుడ పురాణం వినిపించిన శివాజీ మాటలు కూడా పూర్తిగా అబద్ధాలని తేలిపోయింది. తనపై హత్యాయత్నం జరిగినప్పటికీ వైఎస్ జగన్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా ఈ స్థాయి పరిణతి చూపించడం చాలా గొప్ప విషయమే.

అయితే ఇక్కడ తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే చంద్రబాబులో ఆ స్థాయిలో తత్తరపాటు, వణుకు ఎందుకు వచ్చింది? జగన్ అభిమాని అని చెప్తున్న శ్రీనివాస్‌కి అర్హత లేకపోయినప్పటికీ ఇరవై వేలు రూపాయల జీతంతో టిడిపి నాయకుడి క్యాంటీన్‌లో ఉద్యోగం ఎవరు ఇచ్చారు? తినడానికి కూడా లేని పేదలు అని చెప్తున్న శ్రీనివాస్ లక్షల రూపాయల డబ్బులతో ఎలా జల్సా చేశాడు అన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ నిజాలు చంద్రబాబు అధికారంలో ఉండగా బయటపడే ఛాన్స్ లేదు. అయితే చంద్రబాబు నుంచి లోకేష్‌తో సహా బాబు బ్యాచ్ నాయకులు అందరూ, ఆయన భజన మీడియా జనాలందరూ కూడా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన మరుక్షణం నుంచీ ఎంత టెన్షన్ పడ్డారో, ఏ స్థాయిలో ఆందోళన చెందారో స్పష్టంగా తెలుసుకున్న జనాలకు మాత్రం బాబు హత్యా రాజకీయాల విషయంలో పూర్తి స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. జగన్‌పై జరిగింది హత్యాయత్నమే అని చంద్రబాబు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ కూడా తేల్చేయడం కచ్చితంగా పచ్చ బ్యాచ్‌ని బోనులో నిలబెట్టినంత స్థాయి విషయమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -