Friday, April 26, 2024
- Advertisement -

మేలుకున్న వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

రాష్ట్రంలో ప్ర‌స్తుతం వైఎస్ఆర్‌సీపీ హ‌వా న‌డుస్తోంది. సర్వేలు కూడా వైఎస్ఆర్‌సీపీకే అనుకూలంగా వ‌స్తున్నాయి. దీనికి తోడు చంద్ర‌బాబు మాట‌లు, చేత‌ల‌పై ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌న్న‌గిల్లుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌స్తామో.. రామో అన్న ఆలోచ‌న‌లో ఇప్ప‌టికే అధికార‌పార్టీ నేత‌లు ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ సైకిల్ దిగి వ‌చ్చేవారికి ప్ర‌త్యేక ఆహ్వానం ప‌లుకుతోంది. ఇప్పుడు ఈ అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చేందుకు కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నిస్తున్నారు.

టికెట్ కేటాయిస్తార‌ని భ‌రోసా ఇస్తే చాలు.. పార్టీ కండువా క‌ప్పుకోని చంద్ర‌బాబు అస‌లు గుట్టు మీడియా ముందు చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. మ‌ళ్లీ గెలిచి త‌మ దందాలు హాయిగా చూసుకుందామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.కానీ వైఎస్ జ‌గ‌న్‌ పార్టీలోకి వ‌చ్చే వారంద‌రిని వ‌చ్చిన‌ట్టుగా చేర్చుకోవ‌ద్దని ఖ‌రాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌ల విశ్వ‌స‌నీయ‌త‌ను కొల్పోయి.. భారీగా అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌ద్ద‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన‌ట్టు సమాచారం.

ఈ ఆలోచ‌న జ‌గ‌న్‌కే వ‌చ్చిందో.. లేక మ‌రేవ‌రైనా సూచించారో తెలియ‌దు కానీ.. ఇది మంచి ప‌రిణామ‌మ‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అదేదో సినిమాలో త్రివిక్ర‌మ్ చెప్పిన‌ట్టు.. గాలి కోసం కిటికి తిస్తే.. దానితో పాటు దుమ్ము కూడా వ‌స్తుంది అన్న‌ట్టు.. పార్టీ మారే వారితో లాభాల‌తో కొన్ని న‌ష్టాలు కూడా వ‌చ్చే ప్ర‌మాద ముంటుంది క‌దా అంటున్నారు వైఎస్ఆర్‌సీపీ నేత‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -