- Advertisement -

రాజీనామాకు వైకాపా ఎంపిలు రెడీ… ఎన్టీఆర్‌లా బాబు రాష్ట్రం కోసం మద్దతివ్వగలడా: బాబుకు జగన్ సూటి ప్రశ్న

- Advertisement -

బడ్జెట్‌లో ఎపికి ఏమీ రావని చంద్రబాబుకు ముందే తెలుసు. అందుకే పచ్చ బ్యాచ్ మొత్తం కూడా బడ్జెట్ ప్రసంగం ఇంకా పూర్తవ్వకముందే సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పడి ఏడవడం మొదలెట్టారు. బడ్జెట్‌లో నరేంద్రమోడీ చిప్ప చేతికిచ్చి ఒక రోజు గడిచిపోతున్నప్పటికీ చంద్రబాబు ఇంతవరకూ కనీసం ఎందుకు స్పందించడం లేదు? చంద్రబాబు ఆగ్రహం, రంకెలేస్తున్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు, ఆవేశపడుతున్నాడు అని పచ్చ మీడియాలో వార్తలు కనిపించడమే కానీ నరేంద్రమోడీకి కనీసం చంద్రబాబు తన నిరసన అయినా తెలిపాడా? ఇలాంటి విషయాలను మాత్రం పచ్చ జనాలు అస్సలు పట్టించుకోరు. అధికారంలో ఉన్న చంద్రబాబు అట్టర్‌ఫ్లాప్ అవుతున్నా ఎవరూ అడగరు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌ ఎందుకు నరేంద్రమోడీని తిట్టట్లేదు? ఎందుకు రాష్ట్రానికి నిధులు తీసుకురావడం లేదు? ఎంపిల చేత ఎందుకు రాజీనామా చేయించడం లేదు? అని మాత్రం గోల పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే విషయంపై వైఎస్ జగన్ ఘాటుగా స్పందించాడు.

వైకాపా ఎంపిలు ఎందుకు రాజీనామా చెయ్యడం లేదు అని ప్రశ్నించిన ఒక సీనియర్ జర్నలిస్టుతో తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు జగన్. ఇప్పటికిప్పుడు తన ఎంపిల చేత రాజీనామా చేయిస్తా……….నరేంద్రమోడీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక హోదానే లక్ష్యంగా ఎన్నికలకు పోతాం……ఆ ధైర్యం మాకుంది. మరి చంద్రబాబు కూడా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చేసినట్టుగా చేయగలడా? తెలుగు వాడైన పీవీ నరసింహారావు ప్రధాని అవుతున్నాడన్న ఉద్ధేశ్యంతో పోటీగా తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు ఎన్టీఆర్. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేసిన వైకాపా ఎంపిలపై తన పార్టీ అభ్యర్థులను పోటీకి నిలపకుండా ఉంటాడా? అలా అని చంద్రబాబు చెప్పగలడా?

వైకాపా ఎంపిలు రాజీనామా చేసిన వెంటనే నంద్యాల ఎన్నికల విషయంలో చేసినట్టుగానే డబ్బు, విష ప్రచారంతో, అధికార బలంతో ఒకరిద్దరు ఎంపీలను అయినా ఓడిస్తాడు. ఆ తర్వాత ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు వ్యతిరేకత లేదని, అంతా బ్రహ్మాండం అని ప్రచారం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడిచ్చే నయా పైసల సాయం కూడా కేంద్రం నుంచి రాదు……వైకాపా ఎంపిలు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసం మద్దతిస్తాను అని చంద్రబాబును చెప్పమనండి. లేకపోతే టిడిపి, వైకాపా ఎంపిలు అందరిచేత రాజీనామా చేయిద్దాం…..ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాజీనామా చేసిన వాళ్ళనే మళ్ళీ గెలిపించమని కోరదాం….అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాతీయ పార్టీలపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో కాంగ్రస్, బిజెపిలతో పాటు దేశం మొత్తానికి తెలుస్తుంది. అలా చెయ్యడానికి నేను, నా పార్టీలు ఎంపిలు రెడీ? చంద్రబాబు రెడీనా?

ఇదీ ఆ సీనియర్ జర్నలిస్టుతో జగన్ చెప్పిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఓ తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడన్న విషయాన్ని అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడం కోసమే పార్టీ పెట్టిన ఎన్టీఆర్……….జీవితాంతం కాంగ్రెస్‌ని ద్వేషించిన ఎన్టీఆర్……..ఆ ఒక్క సందర్భంలో మాత్రం కాంగ్రస్ పార్టీ అభ్యర్థి పీవి నరసింహారావుకు మద్దతిచ్చాడు. మరి చంద్రబాబు కూడా అన్నీ నష్టపోయి ఉన్న …..ఇంకా నష్టపోతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ స్థాయిలో ఆలోచించి గొప్పగా స్పందించగలడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -