Friday, May 3, 2024
- Advertisement -

బాబుపై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన‌ వైఎస్ జ‌గ‌న్‌…..

- Advertisement -

రాజ్‌భవన్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… గవర్నర్‌ నరసింహన్‌తో బేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎన్నికల తర్వాత జరగుతోన్న పరిణామాలు, ప్రభుత్వ పాలనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్ బృందం.

ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత వైసీపీపై జ‌ర‌గుతున్న దాడుల నేప‌ధ్యంలో గ‌వ‌ర్న్‌ను క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. చంద్రబాబునాయుడి వైఖరి, ఆయన ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లిన జగన్, పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

గవర్నర్‌తో భేటీ అయిన వైసీపీ బృందంలో వైఎస్ జగన్‌తో పాటు కోన రఘుపతి, శ్రీకాంత్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కార్మూరు, అవంతి, పెద్దిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, సజ్జల తదితరులున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -