Thursday, May 9, 2024
- Advertisement -

కావలి…ప్రతాప్‌రెడ్డి హ్యాట్రిక్ కొట్టేనా?

- Advertisement -

నెల్లూరు ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది పెద్దారెడ్డి అనే సినిమా డైలాగ్. సినిమాలో చెప్పినట్లుగానే నెల్లూరులో పెద్దారెడ్ల అడ్డానే. ఏదైన నియోజకవర్గంలో ఇద్దరు రెడ్డిలు పోటీ పడుతున్నారంటే అందరి చూపు వారిపైనే ఉంటుంది.అలాంటి పోరు ఈసారి కావలిలో జరుగుతోంది.

వైసీపీ తరపున రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుండి కావ్య కాష్ణారెడ్డి బరిలో ఉన్నారు. వీరికి ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సవాల్ విసురుతున్నారు. ఇక ఇక్కడినుండి రెండుసార్లు గెలిచిన ప్రతాప్‌రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని తేల్చి చెబుతున్నారు.

కావాలి నియోజకవర్గం విషయానికొస్తే రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ కంచుకోట. కానీ ఆ తర్వాత ఇక్కడ పట్టుకొల్పోయింది కాంగ్రెస్. వైసీపీ సంక్షేమం, తాను చేసిన అభివృద్ధికి తోడు కీలక నేతలు వైసీపీలో చేరడం తన గెలుపుకు దోహదపడుతుందని ప్రతాప్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవలె టీడీపీ నేత విష్ణువ‌ర్ధన్‌రెడ్డి వైసీపీలో చేరడం, గ్రూప్ వార్ సమసిపోవడం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు.

ప్రతాప్ రెడ్డికి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు కావ్య కృష్నారెడ్డి. ఈసారి గెలిచి సత్తాచాటుతానని చెబుతున్నారు. అయితే వీరికి వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్‌ నుండి పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో సుధాకర్‌కు 10వేల ఓట్లు రాగా ఈసారి ఎవరికి గండి కొడతారోననే టెన్షన్ అందరిలో ఉంది. మొత్తంగా కావలి పోరులో విజేతగా నిలిచేది ఎవరనే చర్చ మాత్రం స్థానికంగా జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -