Thursday, April 25, 2024
- Advertisement -

ఇంకా ఎంత‌మంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ప్ర‌భుత్వం క‌ళ్లు తెరుస్తుంది? : వైఎస్ షర్మిల

- Advertisement -

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్బంగ మెద‌క్ జిల్లా వెల్దుర్తి మండ‌లం చేర్యాల‌లో వైఎస్ ష‌ర్మిల పర్యటించారు. ఉద్యోగం దొర‌క్క మ‌న‌స్తాపంతో మే 16న ఆత్మహత్య చేసుకున్న కొట్టము వెంకటేశ్ కుటుంబ స‌భ్యుల‌ను ఆమె ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఉద్య‌మ ల‌క్ష్యాల‌కు ద‌రిదాపుల్లో లేవని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది యువత ఆశ పడ్డారని.. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం వారి ఆశల్లో నిప్పులు పోస్తున్నారని అన్నారు. తెలంగాణ వ‌చ్చి ఏడేళ్లు గ‌డిచినా నిరుద్యోగులు చావే దిక్క‌ని అనుకుంటున్నార‌ని చెప్పారు. ఉద్యోగం దొర‌క్క మ‌న‌స్తాపంతో కొట్టము వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారని.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.

దయచేసి ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. నేను మీ కోసం కొట్లాడుతా. మంచి రోజులు వస్తాయి అని ష‌ర్మిల చెప్పారు. ఇంకా ఎంత‌మంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ప్ర‌భుత్వం క‌ళ్లు తెరుస్తుంద‌ని ఆమె నిల‌దీశారు. ఇప్పటికైనా ఒక ఉద్యమకారుడిగా ఆలోచించి ఉద్యోగాల కోసం జరుగుతున్న ఆత్మహత్యలను ఆపండి. ఖాళీగా ఉన్న లక్ష 91వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికెషన్స్ ఇవ్వండి అని ఆమె కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -