Monday, April 29, 2024
- Advertisement -

ప‌వ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన వైసీపీ మాజీ ఎంపీ….

- Advertisement -

కొద్దిరోజుల క్రితం వైసీసీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం భారీ స్థాయిలో జ‌రిగింది. పవన్ చేసుకున్న పెళ్లిల్ల‌పై జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. వాటికి ప‌వ‌న్‌కూడా త‌న‌దైన శైలిలో జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.దీంతో ఇరు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప‌వ‌న్‌, జ‌న‌గ్ల‌పై వైసీపీ తిరుప‌తి మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త్వరలోనే వైసీపీ, జనసేనలు కలిసిపోతాయని ఈమాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చర్చనీయాంశమయ్యాయి.వైసీపీ, జనసేన పార్టీలు త్వరలోనే ఒక్కటవుతాయని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేసిన వ‌ర‌ప్ర‌సాద్ ప‌వ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

పవన్ విజన్ ఉన్న నాయకుడని, గతంలో తాను ప్రజారాజ్యం తరఫున తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు పవన్‌ను చాలా దగ్గరుండి గమనించానని పేర్కొన్నారు. సమాజానికి ఏదో చేయాలన్న తపన, బాధ్యత పవన్ కల్యాణ్‌లో కనిపిస్తాయని కితాబిచ్చారు. సీపీలో చాలా విశ్వాసంగా పనిచేస్తున్న తానే ఈసారి తిరుపతి నుంచి బరిలోకి దిగబోతున్నట్టు పేర్కొన్నారు. టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన వరప్రసాద్.

ప్రజా నేతగా జగన్, ప్రజా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. గతంలోనూ అనేక సందర్భాల్లో మాజీ ఎంపీ వరప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు పవన్ మద్దతు ఇస్తానని పవన్ తనతో చెప్పినట్టు గత జూన్‌లో వరప్రసాద్ మీడియా ముందు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -