Thursday, May 2, 2024
- Advertisement -

మ‌రింత దూకుడు పెంచిన జ‌గ‌న్‌….

- Advertisement -

సేమ్ టు సేమ్‌. అదే సీన్ రిపీట్‌. చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌లో ఏమాత్రం త‌గ్గ‌డంలేదు స‌రిక దా మ‌రింత దూకుడును పెంచారు. ప్రజల్ని వంచిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని నడిరోడ్డు మీద కాల్చేసినా తప్పు లేదన్న వైఎస్‌ జగన్‌పై అధికార‌పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. చివ‌రికి ఈసీకి జ‌గ‌న్ పై ఫిర్యాదు చేయ‌డంతో..జ‌గ‌న్ ఈసీకి వివిర‌న ఇచ్చారు.

ఇది మ‌రువ‌క ముందే జ‌గ‌న్ అవే వ్యాఖ్య‌లు రిపీట్ చేశారు. నడిరోడ్డు మీద కాల్చేసినా తప్పు లేదన్న వైఎస్‌ జగన్‌…ఇప్పుడు చంద్రబాబుకి ఉరే సరి’ అని తేల్చారు. ఉరేసినా తప్పు లేదంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.

వైఎస్‌ జగన్‌ ఈ స్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డంతో షరామామూలుగానే అధికార పార్టీ నుంచి జగన్‌పైకి విమర్శలు దూసుకొచ్చాయి. జగన్‌ది ఉన్మాద వైఖరి అనీ, ఎన్నికల కమిషన్‌ జగన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్‌కి, జగన్‌ తీరుపై మరోమారు ఫిర్యాదు చేస్తామన్నారాయన.

మొత్తమ్మీద, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంతకు ముందెన్నడూ లేనంత ఆవేశకావేశాలకు గురవుతున్నారన్నది నిర్వివాదాంశం. ఇంకోసారి ఎన్నికల కమిషన్‌ నుంచి తాఖీదులు అందుకోవాల్సి వస్తే, ‘తూచ్‌, ఏదో ఆవేశంతో అనేశానుగానీ..’ అంటారా.? ఏమోగానీ, వైఎస్సార్సీపీ శ్రేణులైతే జగన్‌ ప్రసంగాలతో మరింత ఉత్సాహంతో ఊగిపోతున్నాయి. ముందు ముందు ఏంజ‌రుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -