Tuesday, May 14, 2024
- Advertisement -

సర్వే ఫ‌లితాల ఆధారంగానె నాయ‌కుల‌కు పార్టీ టికెట్లు…

- Advertisement -

రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులను ఎదుర్కొంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌ల‌నె కోరిక త‌ప్ప ఆదిశ‌గా ప్య‌త్నాలు చేయ‌డంలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీలో చెప్పుకోద‌గ్గ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికి క్యాడ‌ర్‌ను ప‌టిష్టం చేయ‌డంలేద‌న్న‌ది వాస్త‌వం. పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, స‌ల‌హాదారునిగా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందె. ప్ర‌స్తుతం పార్టీలో ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ ఒక‌టి సాగుతోది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప‌రిస్థితిపై ఇప్ప‌టికె రెండు సార్లు స‌ర్వే చేయించారు. అయితె స‌ర్వేలో ఎక్క‌డా కూడా అనుకులంగా ఫ‌లితాలు రాలేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. రెండు టీంల‌తో స‌ర్వే చేయించి వాటి ఫ‌లితాల‌ను జ‌గ‌న్ ముందుంచారంట‌. సర్వే ఫ‌లితాల‌ను చూసిన జగన్ షాక్ గుర‌య్యారంట‌.

అందుకె పాద‌యాత్ర ప్రారంభించేలోపు అంద‌రి నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. స‌మావేశంలో స‌ర్వే ఫ‌లితాలు నాయ‌కుల ముందుంచ‌నున్నారంట జ‌గ‌న్‌. స‌ర్వే ఫ‌లితాల‌పై పార్టీ నేతలతో చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలన్న దానిపై సుధీర్ఘంగా చర్చించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

స‌ర్వేల ఫ‌లితాల ఆధారంగానె నియోజకవర్గంలో బలంగా లేని వారికి సీట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారట. ప్ర‌శాంత్ కిషోర్ కూడా ఇదే సూచ‌న చేశారంట‌. స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల‌పై నాయ‌కుల్లో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -