Sunday, May 19, 2024
- Advertisement -

రోడ్ల మీద యూటర్న్ బోర్డులకు బదులు చంద్రబాబు ఫొటోలు పెట్టాలి..వైసీపీ

- Advertisement -

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద ఉండే యూ టర్న్ లను చూస్తే, తనకు చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యూటర్న్ బోర్డులకు బదులు చంద్రబాబు ఫొటోలు పెడితే బాగుంటుందని అన్నారు. అప్పుడైనా ఆయన జ్ఞానోదయం అవుతుందేమో’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు

ఢిల్లీలో చంద్రబాబును కలిసేందుకు ఏ పార్టీ నేతలు కూడా ఇష్టపడటం లేదని… చంద్రబాబును కలవండి అంటూ టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతలను అడుక్కుంటున్నారని చెప్పారు. దావోస్ కు వెళ్లినప్పుడు ఇడ్లీ, దోశ అంటూ ప్రమోట్ చేసుకున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

చంద్రబాబు తీరు చూస్తుంటే బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడిలా ఉందని సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు చంద్రబాబు ఢిల్లీకి రాలేదని, కేవలం వ్యవస్థలను తనకు అనుకూలంగా మలచుకునేందుకే వచ్చారని అన్నారు. నిన్న రాత్రి చంద్రబాబు కొన్ని రహస్య సమావేశాలు జరిపారని… ఎవరెవరిని కలిశారు? ఎందుకు కలిశారు? ఎలాంటి లావాదేవాలు జరిపారు? అనే విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ జరగకుండా టీడీపీ ఎంపీలు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఢిల్లీకి వ‌చ్చిన బాబు సినిమా షూటింగ్ తరహాలో రెడీ.. క్లాప్‌.. 1, 2, 3.. అనగానే చంద్రబాబు పోజులు ఇచ్చారని, ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండి.. ఈరకంగా ప్రవర్తిస్తున్న మహానుభావుడు ఆయన అని అన్నారు. టీడీపీ సైకిల్‌ రెండు చక్రాలు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ ఒక చక్రం, జనసేన మరో చక్రంగా వ్యవహరించిందని, అంతకుముందు కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు సైకిల్‌ చక్రాలుగా పనిచేశాయని, ఇప్పుడు రెండు చక్రాలు ఊడిపోవడంతో చక్రాలు లేని సైకిల్లా ఆ పార్టీ పరిస్థితి మారిపోయిందని అన్నారు. చంద్రబాబును ఎవరు విశ్వసించడం లేదని, ఆయనను ఎవరూ కలిసేందుకు సిద్ధపడటం లేదని, చంద్రబాబు ఏకాకిగా మారిపోయారని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -