Friday, May 10, 2024
- Advertisement -

వైఎస్‌ల పేరెత్తెతే కలలో కూడా కలవరమేల చంద్రబాబూ? రాజకీయం వద్దని బాబు చెప్పడమా?

- Advertisement -

చంద్రబాబు రాజకీయాలు చెయ్యొద్దంటున్నాడు. రాజకీయం గురించి మాట్లాడొద్దంటున్నాడు. సరిగా కళ్ళు కూడా తెరవని మనవడి నుంచీ తన నిద్ర, స్నానం, తిండితో సహా అన్ని విషయాలనూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడొద్దంటున్నాడు. చేతల కంటే మాటల ప్రచారాన్ని ఎక్కువ నమ్మే చంద్రబాబు తన ప్రచారం కోసమే జన్మభూమి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడన్నది నిజం. జన్మభూమి కార్యక్రమాల కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని తన ప్రచారం కోసం నియోగిస్తుంటాడు చంద్రబాబు. డ్యాష్ బోర్డ్ అనే ఒక కొత్త టెక్నాలజీ తెచ్చానని……ఆంద్రప్రదేశ్‌లో ఏ మూల ఏ సమస్య ఉన్నా నాకు క్షణాల్లో తెలిసిపోతుందని ఆ మధ్య డప్పు కొట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు జన్మభూమి అంటూ వేల కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నట్టు? అయినా విలేజ్ స్థాయి వరకూ కూడా ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ఉన్న నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వేల కోట్ల రూపాయలతో పబ్లిసిటీ స్టంట్స్ చేయాలా?

‘నాది ఉడుం పట్టు…….కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్నా, రాయలసీమను రతనాల సీమగా చేస్తా……నాకు సహకరించండి, ఆశీర్వదించండి….నాది పేదల కులం, పేదల పక్షపాతిని, కొందరు కోర్టుకెక్కినా, కాంట్రాక్టర్లు మొండికేసినా వెనక్కి చూడకుండా గట్టిగా సంకల్పించి అభివృద్ధి సాధిస్తున్నాం, తెదేపా కష్టానికి ఫలితమే రాయలసీమలో ఉన్న నీళ్ళు, కొందరు అభివృద్ధికి అడ్డుపడినా కాలువల దగ్గర పడుకుని మరీ కార్యక్రమాలు చేశాం, నదుల అనుసంధానం చేసి చరిత్ర సృష్టించాం, కొందరు అబద్ధాలు ఆడుతూ దారుణమైన రాజకీయం చేస్తున్నారు……….ఇవీ చంద్రబాబు మాట్లాడిన మాటలు. తాను ఎంతో కష్టపడి పనులు చేస్తున్నాను అని చెప్పుకోవడంతోనే చంద్రబాబుకు సంతృప్తి ఉండదు. ఆ పనులకు వైకాపా అడ్డుపడుతున్నప్పటికీ తాను హీరోయిక్‌గా ఆ అడ్డంకులను అధిగమించి మరీ చించేస్తున్నానని చెప్పుకోవడంలో చంద్రబాబుకు అదో తుత్తి.

చంద్రబాబు మాట్లాడిన పై మాటలన్నీ రాజకీయ మాటలు కాదా? అన్నీ అభివృద్ధికి సంబంధించిన మాటలేనా? ఒక వేళ చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ అభివృద్ధికి సంబంధించిన మాటలే అయితే………అవే నీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అధికారిక కేటాయింపులు, అధికారిక రికార్డ్స్‌లో ఉన్న వివరాలు చెప్పినా కూడా అభివృద్ధి మాటలే అవుతాయిగా. అవే అభివృద్ధి కార్యక్రమాల కోసం వైఎస్ చేసిన కృషి గురించి చెప్పడం కూడా అభివృద్ధి గురించి చెప్పడమే అవుతుందిగా? నిజాయితీగా ఆలోచిస్తే అదే నిజం.

కానీ పచ్చ కామెర్ల పచ్చ బ్యాచ్ దృష్టిలో మాత్రం చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి. ఆయన చేసిన పనులు మాత్రమే అభివృద్ధి. 85శాతం పనులు వైఎస్ చేసినట్టుగా అధికారిక రికార్డులు ఉండొచ్చుగాక. ఆ విషయం గురించి వాళ్ళకు అస్సలు పట్టింపులేదు. మిగిలిన పదిహేను శాతం చేసిన చంద్రబాబే వాళ్ళకు హీరో. వైఎస్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడితే మాత్రం ఎంపి స్థాయి వ్యక్తులను కూడా……..‘ఏయ్……’ అంటూ గద్దిస్తాడు చంద్రబాబు. అదే విధంగా జగన్ కూడా ‘ఏయ్…..’ అని ఎవరినైనా అంటే అది జగన్ ఫ్యాక్షనిజం, హింసాప్రవృత్తి అంటూ గగ్గోలు పెడతారు. చంద్రబాబు ‘ఏయ్’ అంటే మాత్రం అది గాంధీని మించిన అహింసా సిద్ధాంతం అవుతుంది. తాను చేస్తే శృంగారం…….ఇతరులు చేస్తే వ్యభిచారం లాంటి సామెతలు ఎందుకు పుట్టుకొచ్చాయో అర్థమవుతోందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -