Saturday, May 4, 2024
- Advertisement -

ఫిక్స్ః 2019 ఎన్నికల్లో ఎపిలో వైకాపాను చంద్రబాబే గెలిపించబోతున్నాడా?

- Advertisement -

వినడానికే ఆశ్ఛర్యంగా ఉందా? వైఎస్ జగన్ అనే వ్యక్తి రాజకీయాల్లోనే ఉండకూడదు అని ఆలోచించే చంద్రబాబు……..వైఎస్ జగన్ ఒక్కడిని దెబ్బకొట్టడానికి రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ హయాంలోనూ, రాష్ట్ర విభజన సమయంలోనూ, 2014 ఎన్నికల సమయంలోనూ ఎపి ప్రజలను అత్యంత దారుణంగా వంచించిన చంద్రబాబు తానే వైఎస్ జగన్‌ని ఎందుకు గెలిపిస్తాడు అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం చంద్రబాబులో భయాందోళనలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. కొడుకు రాహుల్‌ని నిలబెట్టాలని తాపత్రయపడిన సోనియాలానే ఇప్పుడు లోకేష్ కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు. అన్నింటికీ మించి తెలంగాణాలో కెసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే…….చంద్రబాబు ఎపిలో ఓడిపోతే ఓటుకు నోటు కేసు ఏ స్థాయిలో మెడకు చుట్టుకుంటుందో అన్న భయం బాబుతో ఆయన భజన మీడియా జనాలకు కూడా ఉంది. ఇక నరేంద్రమోడీ మళ్ళీ గద్దెనెక్కితే అనే ఊహకే భయపడిపోయే స్థాయిలో ఉన్నారు పచ్చ పార్టీ అధినాయకులు, ఆ పార్టీ భజన మీడియా అధినేతలు.

అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కెసీఆర్ మళ్ళీ సిఎం కాకూడదు అని వ్యూహరచన చేస్తున్నారు. అయితే చంద్రబాబువి అచ్చం డప్పాలేనని కెసీఆర్‌ని ఓడించే సత్తా చంద్రబాబు, చంద్రబాబు పొత్తుపెట్టుకోబోతున్న కాంగ్రస్‌కి అస్సలు లేదని చంద్రబాబు భజన బృందంలో ముఖ్యుడు రాధాకృష్ణ తేల్చేశాడు. అనవసరంగా కెసీఆర్‌తో చంద్రబాబు గొడవపడుతున్నాడని, కచ్చితంగా కేసీఆరే గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్‌కి వ్యతిరేకంగా చంద్రబాబు ఏం చేసినా కూడా అధికారంలోకి వచ్చాక కెసీఆర్ అంతకు అంతా బదులు తీర్చుకుంటాడన్న భయాందోళనలు వ్యక్తం చేస్తూ కెసీఆర్‌కి వ్యతిరేకంగా పోవద్దని బాబుకు సలహా ఇచ్చాడు రాధాకృష్ణ.

అయితే రాధాకృష్ణ చెప్పని మరో విషయాన్ని ఇప్పుడు ఇతర సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే తెలంగాణాలో కేసీఆర్‌ని చేయగలిగింది ఏమీ లేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అప్పనంగా అధికారాన్ని జగన్‌కి అప్పగించినట్టేనని చెప్తున్నారు. కాంగ్రస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రజల కోపం ఎప్పటికీ తగ్గే అవకాశమే లేదని ………..అలాంటి కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కచ్చితంగా 2019 ఎన్నికల్లో టిడిపికి బుద్ధి చెప్తారని విశ్లేషిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించే అవకాశం ఉందని……….అదే జరిగితే టిడిపి ఓటు బ్యాంక్‌నే షేక్ అవ్వడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే టిడిపి భజన మీడియా అధినేత రాధాకృష్ణ చెప్పినట్టుగా కేసీఆర్‌తో శతృత్వం చంద్రబాబుకు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఎపిలో వైఎస్ జగన్‌కి కేసీఆర్ ఓ స్థాయిలో సాయం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇక కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారం దెబ్బతో ఎపి ప్రజలు పూర్తి ఒన్ సైడెడ్‌గా జగన్‌ని గెలిపించినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకూ కొరగాకుండా పోయే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని శతృవులా భావించే జగన్‌కి అప్పనంగా అప్పగిస్తాడా? అలాంటి నిర్ణయం తీసుకుంటాడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -