Sunday, May 19, 2024
- Advertisement -

2014లో బాబుః నేను సీమాంధ్ర బిడ్డను కానా? నేనుండగా అన్యాయమా అన్నారు…. సర్వం క్షవరం

- Advertisement -

పంచ్ డైలాగులు పేల్చాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా? ప్రపంచంలోనే….. శిఖరాగ్రస్థాయిలో….ఆత్మగౌరవం….ఆత్మాభిమానం…..పెద్దమాదిగ…..పెద్ద కాపు……ప్రాణాలైనా ఇచ్చేస్తా……అన్నీ చూసేశా……సిఎం పదవి నాకేమైనా కొత్తా……ఎవ్వరికీ భయపడను……ఇలా ఎన్నో డైలాగులు అవలీలగా చెప్తూ ఉంటారు. కాకపోతే అన్నీ మాటలే. చేతలను పరిశీలిస్తే మాత్రం మొత్తం వ్యవహారం రివర్స్‌లో ఉంటుంది. కారణాలు ఏవైనా కెసీఆర్‌కి చంద్రబాబు భయపడుతున్నాడన్నది కంటికి కనిపిస్తున్న నిజం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పల్లెత్తు మాట అనలేకపోయాడు. ఇక కెటీఆర్‌తో ఫొటోలు దిగడానికి నారా చంద్రబాబు, లోకేష్‌లు ఉబలాటపడిన వైనం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరిచింది. ఇక మోడీ అంటే చంద్రబాబు ఏ స్థాయిలో భయపడుతున్నాడో చెప్పనవసరం లేదు. ఇక పదవి అంటే చంద్రబాబుకు ఉన్నంత ప్రీతి ఇంకెవ్వరికీ ఉండదు. ఆ పదవి కోసం మామకు వెన్నుపోటు పొడవగలడు, ప్రజలకు కూడా అన్నీ అబద్ధాలు చెప్పి నిలువునా ముంచగలడు.

ఆ విషయం పక్కనపెడితే తాజాగా చంద్రబాబు ఓ పంచ్ డైలాగ్ పేల్చాడు. ‘నేను సీమ బిడ్డను కానా? నేనుండగా సీమకు అన్యాయమా?’ అన్నది ఆ డైలాగ్. అయితే 2014 విభజనకు ముందు కూడా చంద్రబాబు ఇలాంటి డైలాగులే చాలా పేల్చాడు. సీమాంధ్ర బిడ్డను………సీమాంధ్రకు అన్యాయం జరగనివ్వను అని మాటలు చెప్పాడు. కానీ రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణాలో కూడా అధికారంలోకి రావాలన్న స్వార్థంతో సీమాంధ్రను నిండా ముంచాడు. ఆ తర్వాత సీమాంధ్రలో సంపాదించిన సొమ్ముతో తెలంగాణా ఎమ్మెల్సీని కొనే ప్రయత్నంలో అడ్డంగా బుక్కయిపోయి పదేళ్ళు హక్కు ఉన్న హైదరాబాద్‌ని సీమాంధ్రలకు పరాయిని చేసేశాడు. ఇక సీమాంధ్రకు రావాల్సిన ప్రయోజనాల కోసం కెసీఆర్‌ని ఒక్క సారైనా డిమాండ్ చేయడం……అడగడాన్ని చంద్రబాబు ఎప్పుడో మర్చిపోయాడు. తెలంగాణా విడిచిపెట్టిపోవాలి, తెలంగాణాలో టిడిపిని వదులుకోవాలి లాంటి కెసీఆర్ షరతులకు తలొగ్గబట్టే ఓటుకు కోట్లు కేసును ముందుకు తీసుకెళ్ళకుండా ఉంటానని కెసీఆర్ షరతులు పెట్టాడని కెసీఆర్ సన్నిహితులు చెప్తూ ఉంటారు. బాబు చర్యలు గమనిస్తే అది నిజమే అనిపించేలా చాలా సార్లు ఉంటాయి. సీమాంధ్ర ముద్దుబిడ్డనని చెప్పుకున్న చంద్రబాబు చిత్తశుధ్ది అది. ఇక ప్రత్యేక హోదా విషయంలో మోడీ దగ్గర సాగిలపడడం కూడా అందరికీ తెలిసిన విషయమే.

ఇక ఇప్పుడు రాయలసీమ విషయంలో కూడా ఇవే డైలాగులు కొడుతున్నాడు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు ‘సీమ గూండాలు’ అంటూ రెచ్చిపోయి మాట్లాడేశాడు. రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ వాసులను, పులివెందుల, కడపల గురించి చంద్రబాబు ఎంత నీచంగా మాట్లాడాడో చెప్పనవసరం లేదు. వైఎస్‌లని ఆదరిస్తున్నారన్న దుగ్ధతో మొత్తం రాయలసీమనే గూండాల సీమ అనే స్థాయిలో మాట్లాడాడు చంద్రబాబు. ఇక కర్నూలుకు హైకోర్ట్‌తో పాటు రాయలసీమకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకూ నెరవేర్చింది లేదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తూ ఉంటారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడేవాళ్ళు అని ఇద్దరు పొలిటికల్ బినామీలైన టీజీ వెంకటేష్, బైరెడ్డి రాజశేఖరరెడ్డిల చేత ఎన్నికల సమయంలో హంగామా చేయించి …ఆ తర్వాత పనయిపోగానే వాళ్ళను సైలెంట్ చేసి పడేసి తన పార్టీలో అధికారికంగా చేర్చుకున్న పొలిటికల్ గేం చంద్రబాబుది. కానీ రాయలసీమ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు…….‘నేను రాయల సీమ ముద్దుబిడ్డను కానా? నేనుండగా అన్యాయమా?’ అని సినిమా రైటర్స్ కూడా అయిన పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇస్తూ ఉంటే బాబుగారు హీరోలాగా ఫీలయిపోయి డైలాగులు చెప్పడం మాత్రం రాయలసీమ వాసులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. 2014 సీమాంధ్ర ముద్దుబిడ్డనని చెప్పి సీమాంధ్రను ముంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకూ రాయలసీమకు విభజనలో భాగంగా వచ్చినవాటిని కృష్ణా-గుంటూరుకు తరలించారు. ఇక ఇప్పుడు మరోసారి సీమ బిడ్డను కానా? అని చంద్రబాబు అంటూ ఉంటే ఈ సారి రాయలసీమకు ఏం నష్టం చేస్తాడా అని సీమవాసులు అనుమానంగా, భయంగా చూడాల్సిన పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -