Friday, May 3, 2024
- Advertisement -

ఇక్కడి పందికొక్కులను తరమండి బాబూ

- Advertisement -

తెలుగు ప్రజలు ఎక్కడున్నా పుట్టి పెరిగిన గ్రామాల కోసం ఏం చేయాలో ఆలోచించాలని అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే టీడీపీ అవకాశమిస్తుందని, ఎన్ఆర్ఐలు ప్రజాసేవలో భాగస్తులు కావాలని కోరారు. సొంత గ్రామాల అభివృద్ధికి గ్రామస్థులతో ఆలోచనలు పంచుకోవాలని, గ్రామదర్శిని-వార్డు దర్శిని కార్యక్రమానికి సహకరించాలని, కన్నతల్లిలాంటి జన్మభూమిని మరవకూడదని చంద్రబాబు సూచించారు. ఈ సవంత్సరం నుంచి ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు వస్తుంది కనుక, వాళ్లు ఉన్న చోటు నుంచే ఓటు వేసుకోవచ్చని, టీడీపీకి ఓటు వేసి గెపిలించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రయోజనాలకు చాలా కీలకమని, అభివృద్ధి ముఖ్యమని, చారిత్రక అవసరమని చెప్పారు. సొంత రాష్ట్రం, సొంత గ్రామం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

మరో వైపు ఇక్కడ ఆంధ్రా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ఘనంగా ఆరంభిస్తోంది. పట్టణాల్లో, గ్రామాల్లో, వార్డుల్లో ప్రతి ఇంటికీ టీడీపీ నేతలు వెళ్తూ చంద్రబాబు గొప్పతనం, అభివృద్ధి పనులు, టీడీపీ గెలుపు ప్రజలకు ఎంత అవసరమో చెప్పుకొస్తున్నారు.

అమెరికాలో అయినా ఆంధ్రా తెలంగాణలో అయినా జనం వద్దకు వెళ్లి టీడీపీ నేతలు చెప్పడమే కనిపిస్తోంది. అంతే కానీ పాలనపై, సంక్షేమ పథకాలపై, టీడీపీ ప్రభుత్వంలోని లోటుపాట్లుపై, తెలుగుతమ్ముళ్ల అవినీతిపై జనం ఏం చెబుతున్నారో వినే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల అభివృద్ధికి పాటుపడమని ఎన్ఆర్ఐలను చంద్రబాబు సూచించారు. అసలు గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నదే టీడీపీ తమ్ముళ్లు. అవినీతిలో కూరుకుపోయి రేషన్ కార్డులకు, ఇళ్ల మంజూరుకు, పెన్షన్లకు ప్రతి దానికీ లంచం లంచం లంచం. నామినేటెడ్ పదవుల్లో అతుక్కోపోయిన టీడీపీ నేతల అవినీతికి అంతే లేకుండా పోయింది. పేదలకు ఇళ్ల మంజూరులో వీళ్ల చేతులు తడపాల్సిందే. గ్రామాల అభివృద్ధిలో కాలవులు, పక్కా భవనాలు, కార్యాలయాలు నిర్మాణాల్లో వీళ్లకు కమీషన్లు ఇస్తేనే పనులు ప్రారంభవుతాయి. లేదంటే సవాలక్ష కొర్రీలు పెట్టి ఆటంకాలు కలిగిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవాళ్లలో చాలామంది అవినీతి పందికొక్కుల్లా తయారయ్యారు. ముందు వారిని తరిమికొట్టండి. తర్వాత ఎన్ఆర్ఐలు ప్రజాసేవకు ఆహ్వానించండి. అసలు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పార్టీ గొప్పతనం, పాలన అంటూ చెప్పడం కాదు. పార్టీ గురించి జనం ఏం చెబుతున్నారో అది ఫస్ట్ వింటే వీళ్ల కళ్లుబైర్లు కమ్మడం ఖాయం. జనం ఏ ఏ సమస్యల పరిష్కారం కోరుతున్నారో, ఏఏ అంశాలపై విసిగిపోయి ఉన్నారో ? ఎక్కడ అవినీతి రాజ్యమేలుతోందో ? ఎక్కడ ఏ పనికి ఎంతమందికి చేతులు తడపాల్సి వస్తోందో ? క్షేత్రస్థాయిలో జనం ఇచ్చే అసలు సిసలు ఫీడ్ బ్యాక్ తెలుసుకోండి. మీరు చెప్పింది చాలు ముందు జనం చెప్పేది వినండి. ఆ తర్వాత చర్యలు చేపడతారో లేదో మీ ఇష్టం. కానీ చెప్పడం ఆపి వినడం మొదలు పెడితే మీకే మేలు. లేదంటే ఇప్పటికే మీ సభలకు జనం కరువైపోతున్నారు. రేపు ఓటర్లు కుడా కరువైపోతారు జాగ్రత్త.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -