Monday, May 13, 2024
- Advertisement -

గురక పెడుతున్నారా…..జాగ్రత్త ?

- Advertisement -

నిద్రలో గురక పెట్టటం అనేది అనారోగ్య లక్షణం. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవటం ద్వారా గురక రాకుండా చూసుకోవచ్చు.

అధిక బరువు ఉన్నప్పుడు శరీరంలోని కొవ్వు కణాలు ముఖ్యంగా మెడ దగ్గర ఉండేవి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిని కలిగిస్తాయి. 

ఈ ఒత్తిడి వలన గురక పెరుగుతుంది. బరువు తగ్గటం వలన గురక సమస్య తగ్గుతుంది. వెల్లకిలా పడుకోవటానికి బదులు ఒక పక్కకు ఒత్తిగిల్లి పడుకుంటే గొంతు మీద ఒత్తిడి పడదు. దాంతో గురక సమస్య కూడా తలెత్తదు. కొంత మందికి ఏది తాకినా ఎలర్జీ వచ్చి జలుబు, తుమ్ములు మొదలు అవుతాయి. అందువలన ముక్కు మూసుకుపోయి గాలిని నోటితో పీల్చుకుంటారు. ఇది కూడా గురకకు కారణం అవుతుంది. ఇటువంటి సమయంలో యాంటి అలర్జీ మందులు వాడితే ప్రయోజనం ఉంటుంది. అంతేకాక గురకని నివారించే దిండ్లు, మౌత్ గార్డ్ లను నిపుణుల సలహాతో వాడవచ్చు. భాగస్వామి లేదా ఇతరులు మరీ ఎక్కువగా గురక పెడితే తట్టి లేపాలి. లేదంటే ఒక్కోసారి శ్వాస ఆడక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -