Thursday, May 2, 2024
- Advertisement -

సీక్రెట్ వెబ్సైట్ ను ఇలా షేర్ చేయండి.. ఎవ్వరికీ తెలియకుండా !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి లైఫ్ లో స్మార్ట్ ఫోన్ అనేది భాగమైపోయింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో సరదాగా మాట్లాడాలన్న, చాటింగ్ చేయాలన్న స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇక గేమ్స్ ఎక్కువగా ఆడే స్మార్ట్ ఫోన్ దగ్గర లేనిదే నిద్ర పట్టదు. వీటికి మాత్రమే కాకుండా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్.. వంటి ఇతరత్రా ముఖ్యమైన పనులన్నీ మొబైల్ ద్వారానే చేస్తూ ఉన్నాం. దాంతో మనకు తెలియకుండానే స్మార్ట్ ఫోన్ అనేది మన రోజువారీ లైఫ్ లో ఒక భాగమైపోయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల మంచి ఏ స్థాయిలో ఉందో చెడు కూడా అంతే స్థాయిలో ఉంది. .

అందుకే వీలైనంత వరకు మొబైల్ కు ముఖ్యంగా పిల్లలను దూరంగా ఉంచాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంచితే.. మనం ఏదైనా సమాచారాన్ని ఇంటర్నెట్ లో వెతికే క్రమంలో ఎన్నో వెబ్సైట్స్ ను పరిశీలిస్తూ ఉంటాము. అలాంటి సందర్భంలో మనకు ఉపయోగ పడే కొన్ని వెబ్సైట్స్ ను ఇతరులకు షేర్ చేయాలని చూస్తూ ఉంటాము. అలాంటి సందర్భంలో సాధారణంగా ఆ వెబ్సైట్ లింక్ అనేది కాపీ చేసి ఫ్రెండ్స్ కు షేర్ చేస్తూ ఉంటాము. అయితే అలా మనం కాపీ చేసి షేర్ చేసిన వెబ్సైట్ లింక్ అనేది అందరికీ కనిపించే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం షేర్ చేసే వెబ్సైట్ లింక్ ఎవ్వరికీ కనిపించకుండా ఒక క్యూ ఆర్ కోడ్ రూపంలో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అదెలాగో చూద్దాం !

సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ బ్రౌజింగ్ చేయడానికి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నే ఎక్కువగా వాడుతూ ఉంటాము. క్రోమ్ బ్రౌజర్ లో ఏదైనా వెబ్సైట్ ను వెతికేటప్పుడు ఆ వెబ్సైట్ లింక్ ఎవ్వరికీ కనిపించకుండా క్యూ ఆర్ కోడ్ రూపంలో షేర్ చేయడానికి.. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తరువాత మనం షేర్ చేయాలనుకున్న వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత పైన రైట్ సైడ్ లో మూడు చుక్కలను క్లిక్ చేయాలి. అక్కడ కాస్త కిందకు స్క్రోల్ చేస్తే షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ మీద నొక్కిన తరువాత మనం దేని ద్వారా షేర్ ఛాయాలి అనే ఆప్షన్స్ కనిపిస్తాయి ( అంటే వాట్సప్, ఫేస్ బుక్, ఇంస్టా గ్రామ్ ,..etc,) కాస్త కింద పరిశీలిస్తే అక్కడ క్యూ ఆర్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ క్యూ ఆర్ కోడ్ రూపంలోకి మారుతుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకొని.. ఆ వెబ్సైట్ ఎవ్వరికీ కనిపించకుండా షేర్ చేయవచ్చు. మనం ఎవరికైతే పంపించామో వారు ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది. స్కాన్ చేయడానికి కూడా అదే విధంగా గూగుల్ క్రోమ్ బ్రజర్ లో పైన చెప్పినట్లుగా చేసి క్యూ ఆర్ కోడ్ దగ్గర స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది. అలా మనం పంపించే వెబ్సైట్ ఎవ్వరికీ కనిపించ కూడా ఇలా క్యూ ఆర్ కోడ్ రూపం లో షేర్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

యూపీఐ ద్వారా డబ్బులు వేరే నెంబర్ కు పంపితే.. ఇలా తిరిగి పోడండి !

మొబైల్ పైన గీతలు పడ్డాయా.. అయితే ఇలా చేయండి !

మీ మొబైల్ సూపర్ ఫాస్ట్ గా మారే.. అద్బుతమైన ట్రిక్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -