వ్యక్తిగత నైతిక విలువలు, కుటుంబ విలువలు, పిల్లల పెంపకంతో సహా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ……ఇంకా ఇలాంటి ఎన్నో విషయాల గురించి సుద్దులు చెప్పాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా? కానీ బాబుగారి నీతులన్నీ ఆయన మాటల్లోనే వినిపిస్తూ ఉంటాయి. అది కూడా ప్రత్యర్థుల విషయంలో మాత్రమే ఆ నీతులు మాట్లాడతాడు. మోడీతో పొత్తు ఉన్నంత కాలం ప్యాకేజ్ కేక, హోదా ఇవ్వకుండా ఎపికి మోడీ ఎంతో మేలు చేశాడు, మూడేళ్ళలో మోడీని మించి ఎపికి ఎక్కువ సాయం చేసిన ప్రధానమంత్రులు ఎవ్వరూ లేరు అని అసెంబ్లీ సాక్షిగా అభినందన తీర్మానాలు చేయిస్తాడు. ఒక సారి బ్రేకప్ అయ్యాక ఇక అంతా రివర్స్……..మోడీ అమ్మా అన్నా కూడా ……అదిగో చూడండి నియ్యమ్మా అన్నాడు అని ప్రజలను నమ్మించాలని చూస్తాడు చంద్రబాబు. తిరుమల విషయంలో చంద్రబాబు చేసిన ఓవర్ యాక్షన్ అదే.
ఇలాంటి తన తప్పులు ఎత్తి చూపే మీడియాపై ఇప్పుడు మరోసారి కత్తిదూశాడు బాబు. బాబుతో పాటు పచ్చ బ్యాచ్ మొత్తం కూడా బాబుకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను, బాబు తప్పులను బయటపెడుతున్న సోషల్ మీడియాను హత్య చేయడానికి రెడీ అయిపోయారు. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్‌తో సోషల్ మీడియా అకౌంట్స్‌పైన కూడా పగబట్టినట్టుగా వ్యతిరేక చర్యలకు దిగుతున్నారు. గతంలో కూడా చినబాబు లోకేష్ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో వెనక్కితగ్గారు. ఇప్పుడిక ఎన్నికల ఏడాది కావడం…….ఎన్నికల సర్వేలన్నీ కూడా టిడిపికి ఘోర పరాజయం తప్పదు అని విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన కాలంలో ఉన్నట్టుగా కేవలం తన భజన మీడియా మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చంద్రబాబు. అయితే ఇలాంటి అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలను తెలుగు ప్రజలు ఎప్పుడూ క్షమించలేదు. ఇప్పుడు చంద్రబాబును కూడా నాలుగేళ్ళపాపాలు, ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసం లాంటివాటితో పాటు ప్రజల గొంతుకు నొక్కాలనుకుంటున్నందుకుగాను 2019లో ఓడించడం ఖాయం అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నకల ఏడాదిలో అయినా కాస్త ప్రజలకు మంచి చేస్తారో లేక ఇలాంటి నియంతృత్వ, అరాచక చర్యలతోనే కాలం వెలిబొచ్చి తన ఓటమి తానే కొనితెచ్చుకుంటారో చూడాలి మరి.
