Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీలో హాట్ కేకుల్లా అమ్మ‌డ‌వుతున్న గాజు గ్లాసులు..

- Advertisement -

జ‌న‌సేన పార్టీకి గుర్తేలేద‌ని విమ‌ర్శిస్తున్న వాళ్ల నోటికి తాళం ప‌డింది. పార్టీ గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది ఈసీ. అయితే ఈ గుర్తుపై సోషియ‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇక నేష‌న‌ల్ చాన‌ల్స్ కూడా గుర్తుపై త‌మ‌దైన శైలిలో వ్యంగ్య‌స్త్రాలు సందిస్తున్నాయి. అయితే ఇప్పుడ ఆంధ్ర ప్ర‌దేశ్‌లో విచిత్ర మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

పార్టీ గుర్తుగా గాజు గ్లాసును కేటాయించ‌డంతో పార్టీనేత‌ల్లో అభిమానుల్లో నూత‌నోత్తేజం నెల‌కొంది. పార్టీ గుర్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయాన్ని పార్టీ కేడర్‌కు చెప్పారు. పార్టీ త‌రుపున పోటీ చేస్తున్న అభ్య‌ర్తులు కూడా గ్లాసు గుర్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ప‌వ‌న్ సూచించారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది..అయితే జ‌న‌సేన గుర్తు పుణ్య‌మాని రాష్ట్రంలో మాత్రం విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీ శ్రేణులు, అభిమానులు ఎగ‌బ‌డి గ్లాసుల‌ను కొనుగోలు చేస్తుంటే .. ఉభయ గోదావరి జిల్లా సహా ఆంధ్రాలోని పలు జిల్లాల్లో గాజు గ్లాసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలు చోట్ల ఈ గ్లాసులకు కొరత కూడా ఉంది.

సాధారణంగా గాజు గ్లాసు ధర రూ. 10 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర సహా ఏపీలోని పలు జిల్లాల్లో ఈ గాజు గ్లాసు ధర 50 రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది. మార్కెట్లో గ్లాసులు లేక‌పోవ‌డంతో గ్లాసుల కొర‌త ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం అన్ని ప్లాస్టిక్ గ్లాసులే కాబ‌ట్టి గాజు గ్లాసుల‌కు భారీగా డి మాండ్ ఏర్ప‌డింది.

ఒకప్పుడు గాజు గ్లాసుల వినియోగడం ఎక్కువగా ఉండే టీ స్టాల్స్ దగ్గర వాటి వినియోగం ఉండేది. కాని పేప‌ర్ క‌ప్‌లు రావ‌డంతో వారి అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. కొన్ని చోట్ల గాజు గ్లాసులు లేవంటూ నో స్టాక్ బోర్డు పెట్టేశారు. జనసేన కార్యకర్తలు, నాయకులు తమకు గాజు గ్లాసులు పెద్ద సంఖ్యలో కావాలంటూ కంపెనీలకు ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా క‌నుమ‌రుగు అవుత‌న్న గాజుగ్లాసులు జ‌న‌సేన పుణ్యామ‌ని మ‌రో సారి వెలుగులోకి వ‌స్తున్నాయి. మార్కెట్ల‌లో మూల‌న ప‌డిన స్టాకంతా హాట్ కేకుల్లా అమ్మ‌డుపోతుండ‌టంతో షాపు య‌జ‌మానులు ఖుషీగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -