Saturday, May 4, 2024
- Advertisement -

సీమలో రేపిస్టులు, రౌడీలు, గూండాలే ఉంటారాః బాబు అండ్ కోపై సీమవాసుల ఫైర్

- Advertisement -

బిజెపివాళ్ళు విభజన రాజకీయాలు చేస్తున్నారు…… సీమవాసులను రెచ్చగొడుతున్నారు అని చంద్రబాబు ఆవేధన నటిస్తూ ఉంటాడు. కానీ అదే చంద్రబాబు, టిడిపి నాయకుల వ్యాఖ్యలు మాత్రం సీమవాసుల మనోభావాలను ఓ స్థాయిలో దెబ్బతీస్తూ ఉంటాయి. గోదావరి జిల్లా, తునిలో రైలుపై దాడి జరిగితే సీమ గూండాలు అంటూ రెచ్చిపోయి మాట్లాడేస్తాడు చంద్రబాబు. ఇక పులివెందుల ఫ్యాక్షనిస్టులని చెప్పి చంద్రబాబు ఏ స్థాయిలో అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తాడో చెప్పనవసరం లేదు. ఇక చినబాబు లోకేష్ కూడా రాయలసీమ వాసుల గురించి ఎన్ని సార్లు అవమానకరంగా మాట్లాడేశారో చెప్పనవసరం లేదు. ఒక్క చంద్రబాబు, లోకేష్ అనే కాదు, టిడిపి భజన మీడియా, టిడిపి నాయకులు అందరిదీ అదే దారి. అవకాశం దొరికినప్పుడల్లా రాయలసీమ అంటేనే ఏదో రాక్షసులు ఉంటారు అన్నట్టుగానో, అందరూ రక్తం చూసే జనాలే అన్న స్థాయిలో మాట్లాడేస్తూ ఉంటారు.

తాజాగా చింతమనేని ప్రభాకర్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. చింతమనేని గూండాయిజం, రౌడీయిజం గురించి అందిరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే విషయాన్ని తాజాగా మరోసారి ఘాటుగా ప్రస్తావించాడు పవన్. చింతమనేని పవన్ వ్యాఖ్యలను ఖండించి ఉంటే పోయేది. కానీ అనవసరంగా రాయలసీమను, సీమ వాసులను పస్తావనకు తీసుకొచ్చాడు చింతమనేని. ‘రౌడీయిజం, గూండాయిజం అంటూ పచ్చని గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ మాట్లాడతావా? ఇదేమైనా రాయలసీమ అనుకుంటున్నావా’ అంటూ రౌడీయిజం, గూండాయిజం అంతా సీమలోనే ఉంటుందన్నట్టుగా మాట్లాడేశాడు. అంతేకాకుండా సీమలో అయితే హత్యలు, మానభంగాలు కామన్ అనేలా మాట్లాడిన చింతమనేని…………….గోదావరి జిల్లాల్లో అసలు హత్యలే జరగవని, అత్యాచారాలే ఉండవని చెప్పుకొచ్చాడు.

గోదావరి జిల్లా ప్రజల గురించి గొప్పగా చెప్పడం ఒకే కానీ గోదావరి జిల్లాల ప్రజలతో పోల్చుతూ రాయలసీమ ప్రజలందరూ హత్యలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు అనే అర్థం వచ్చేలా చింతమనేని మాట్లాడడంపై మాత్రం సీమ ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం రాయలసీమపై ఎక్కడ లేని ప్రేమ చూపించే చంద్రబాబు, ఆయన భజన మీడియా, టిడిపి నేతలకు ……..ఓట్ల అవసరం తీరాక రాయలసీమ అంటేనే రాక్షస సీమ అనేలా ప్రచారం చేయడం దారుణమని సీమ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై పచ్చ పార్టీ జనాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి విషయంలో కనీసస్థాయిలో పట్టించుకోకపోవడంతో పాటు……సీమను గూండాలు, రౌడీలు ఉండే ప్రాంతంగా చిత్రీకరిస్తూ ఉన్న టిడిపికి 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తామని రాయలసీమ మేధావుల సంఘం అభిప్రాయపడుతోంది. సీమ జనాలు కూడా ఈ విషయంలో టిడిపిపై పార్టీలకతీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -