Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు ఢిల్లీ టూర్….. సీక్రెట్ బయటపెట్టిన నేషనల్ మీడియా

- Advertisement -

ఎవ్వరికీ భయపడను… బెదిరేది లేదు అంటూ ఈ మధ్య తరచుగా ప్రస్తావిస్తూ ఉన్నాడు చంద్రబాబు. మరోవైపు విజయసాయిరెడ్డి తరచుగా మోడీని కలుస్తున్నాడని, తన తప్పులకు సంబంధించిన రహస్యాలను పిఎంవోకి చేరవేస్తున్నాడని కూడా బాబే ఆక్రోశం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఆ వెంటనే మళ్ళీ నిప్పులా బ్రతికా…ఎప్పుడూ తప్పు చేయలేదు అని కూడా బాబే చెప్తాడు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తంలో ఈ స్థాయిలో టెన్షన్ పడింది ఎప్పుడూ లేదని బాబును దగ్గరగా చూస్తున్న సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఢిల్లీ టూర్ నేపథ్యంలో కూడా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు ఏమీలేవు………కేవలం రాష్ట్ర ప్రయోజనాలే అని తాను పలుమార్లు చెప్పడంతో పాటు టిడిపి నాయకుల చేత కూడా చెప్పిస్తూ ప్రచారం చేయించుకుంటున్నాడు చంద్రబాబు. అయితే టిడిపిలో న్యాయ వ్యవహారాలను చూసుకునే ఓ నాయకుడి ద్వారా నేషనల్ మీడియా కొన్ని నిజాలు రాబట్టింది. తెలుగు మీడియాకు పట్టకుండా పోయిన ఓ వార్త నేషనల్ మీడియాలో మాత్రం బాగానే హైలైట్ అయింది. సంవత్సరాల పాటు స్టే లు ఉండరాదని……మినిమం టైం పీరియడ్ తర్వాత ఎవ్వరిపైన అయినా సరే స్టేలు ఎత్తివేయాలని రీెసంట్‌గా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో ఉన్న నాయకులు అందరికంటే ఎక్కువ సంఖ్యలో స్టే లు తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబే అని న్యాయ నిపుణులే చెప్తూ ఉంటారు. న్యాయ వ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేసే విధానం గురించి సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ మేధావులు కథలు కథలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ స్టే ల ఎత్తివేత సంకట స్థితి నేపథ్యంలోనే చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నాడని వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు. టిడిపి న్యాయ వ్యవహారాలు చూసే ఒక నేత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి వ్యవహారాలు నడిపిస్తున్నాడు. చిన్న స్థాయి నుంచే బాబును నమ్ముకుని, బాబు కోసం పనిచేసిన కొందరు ఇప్పుడు ఢిల్లీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. అందుకే వాళ్ళను ఒక సారి కలిసి పాత స్టే ల విషయంలో సమస్యలు రాకుండా చూసుకోవడంపై బాబు దృష్టిపెడుతున్నాడట. కొత్తగా ఏవైనా కేసులు నమోదయితే అంతా మోడీ కుట్ర అని చెప్పొచ్చు కానీ పాత కేసుల్లో స్టే లు ఎత్తివేసి విచారణ చేపడితే ఆ అవకాశం ఉండదని……..అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పాత కేసులు మాత్రం మెడకు చుట్టుకోకుండా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారని ఢిల్లీ వేదికగా పనిచేస్తున్న జర్నలిస్టులు చెప్పుకుంటున్నారు. ముందు ముందు ఇదే విషయంపై ఇంకా ఎన్ని కథనాలు వస్తాయో చూడాలి మరి. అయినా మోడీ హయాంలో కూడా న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసే స్థాయి చంద్రబాబుకు ఉందా అని మాత్రం టిడిపి నాయకులు టెన్షన్ పడుతూ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -