Thursday, May 9, 2024
- Advertisement -

టిడిపి తుక్కు దీక్ష……. పొట్టచెక్కలయ్యే కామెడీ పండించారుగా?

- Advertisement -

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపకు స్టీల్ ప్లాంట్ వస్తే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా జనాలు నానా రచ్చ చేసి ఆ పరిశ్రమను అడ్డుకుని కడపకు తీవ్ర అన్యాయం చేశారు. పైగా వైఎస్సార్ కడపలో ఉన్న పచ్చని పొలాలు, లేళ్ళు, ప్రకృతి వనాలు ధ్వంసం చేస్తున్నాడంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వార్తాకథలతో రంకెలేయడం…….ఆ కథలు పట్టుకుని చంద్రబాబు నానా రచ్చ చేయడాన్ని అప్పట్లోనే వైఎస్సార్ సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలోనే కడిగేశారు. అది అందరికీ తెలిసిన చరిత్ర.

ఇక ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండి కూడా అవే డ్రామాలు నడిపిస్తున్నాడు చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ చేసింది ఏమీ లేకపోయినప్పటికీ ఎన్నికల ఏడాదిలో సడన్‌గా ఉక్కు పరిశ్రమ గుర్తుకొచ్చింది. ఆమరణ నిరాహారదీక్ష అంటూ డ్రామా మొదలెట్టారు. దీక్షలో కూర్చున్నవాళ్ళు బరువు పెరడం ఏంటి అని సోషల్ మీడియాలో సెటైర్స్ ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. ఇక తాజాగా అంతకుమించిన కామెడీ పండించారు టిడిపి జనాలు. దీక్ష చేస్తున్న బిటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ‘పోలీసులు డౌన్ డౌన్, పోలీసుల అరాచకత్వం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. దాంతో అవాక్కవ్వడం ప్రజల వంతయింది. దీక్ష్ దగ్గర ఉన్న ప్రజలు కూడా టిడిపి నేతల నినాదాల దెబ్బకు షాకవ్వాల్సి వచ్చింది. సాక్షాత్తూ టిడిపి అధినేత చంద్రబాబు సారథ్యంలో పనిచేస్తున్న పోలీసులను డౌన్ డౌన్ అనడం, పోలీసుల అరాచకత్వం నశించాలి, నియంతృత్వం నశించాలి అంటూ నినాదాలు చేయడంతో కొంపదీసి డైరెక్ట్‌గా చంద్రబాబునే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారా అన్న అనుమానాలు వచ్చాయి. లేకపోతే సీనియర్ మోస్ట్ పార్టీ అని చెప్పుకునే టిడిపి జనాలకు బిటెక్ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు టిడిపి ప్రభుత్వాదేశాలతోనే పనిచేస్తున్న విషయం తెలియదా? అని కూడా చర్చించుకున్నారు. వాళ్ళే నిరాహారదీక్షకు కూర్చుని……..వాళ్ళే ఆ దీక్షను విరమించేలా ప్లాన్ చేసుకుని…..ఆ తర్వాత వాళ్ళే వాళ్ళ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసులపై విమర్శలు చేయడం, ఆ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి మించిన కామెడీ ఏం ఉంటుంది? అంతా చంద్రమాయ అనుకోవాలేమో.

లాస్ట్ పంచ్ః ఎడారిని తలపించే కడపకు వైఎస్సార్ ఉక్కు పరిశ్రమ తెస్తే పర్యావరణం, పచ్చదనం నాశనమయిపోతోందని గగ్గోలు పెట్టిన పచ్చ జనాలు……….మూడు పంటలు పండే పచ్చని పంటపొలాలను, మాగాణి భూములను, అటవీ ప్రాంతాలను చంద్రబాబు కబళిస్తే మాత్రం ……….ఆహా…..ఓహో…….అద్భుతం……అత్యద్భుతం…….చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అని నాలుగేళ్ళుగా డప్పు కొట్టుకుంటూ ఉండడాన్ని ఏమనాలో కూడా అర్థం కాని స్థితిలో ఆంద్రప్రదేశ్ ప్రజలు ఉన్నారనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -