Sunday, May 5, 2024
- Advertisement -

బాబు మ‌ళ్లీ కాపీ!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు.. జగన్ మేనిఫెస్టోను కాపీ కొడుతున్నారు. చంద్రబాబు రెండు వేలకు పెంచిన పెన్షన్ ఇప్పుడు మరో వెయ్యి జతపర్చి మూడు వేల రూపాయిలు ఇస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. వైసీపీ హామీలతో పోటీపడాలనే చంద్రబాబు ఎత్తుగడను వేసినట్లు సమాచారం.

నాలుగు రోజుల క్రితం టీడీపీ మేనిఫెస్టో విడుదల కావాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రజాకర్షక పథకాలు చూసి చంద్రబాబు ఆగారు. నాలుగు రోజులుగా వైసీపీ హామీలు లీక్ చేయిస్తూ టీడీపీ క్యాష్ చేసుకుంటోంది. ఇప్పటికే ఉద్యోగుల పీపీఎస్ ను రద్దు చేస్తామనే లీక్ ఇప్పటికే ఇచ్చేశారు. ఇక తాజాగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు లీక్ ఇచ్చాడు. వైసీపీకి ధీటుగా పెన్షన్ పెంచుతామని వెల్లడించారు. ఇలా వైసీపీ హామీలను బాబు దొంగచాటుగా తెలుసుకొని ప్రకటిస్తూ దొంగదెబ్బ తీస్తున్నాడన్న చర్చ సాగుతోంది.

అప్పట్లోనూ జగన్ హామీలను టీడీపీ అధినేత కాపీ కొట్టారు. వైసీపీ ప్లీనరీలో మొదట తాను అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వెయ్యి పింఛన్ ను రెండు వేలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో అలెర్ట్ అయిన బాబు మొన్న జనవరి నుంచి ఏపీ ప్రజలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నారు. దీంతో జగన్ తాజా ఎన్నికల ప్రచారంలో తాను మూడు వేల వరకు పెంచణ్ పెంచుతానని హామీ ఇచ్చారు. దీంతో ఎక్కడ వెనుకబడి పోతానోనని చంద్రబాబు తాజాగా 3వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం విశేషం. ఇలా జగన్ హామీలను ముందే తెలుసుకొని ఆయన్ను బాబు చావుదెబ్బతీస్తున్నాడు. జగన్ హామీలు ప్రకటించడానికి రెడీకాగానే బాబు వాటిని ప్రకటిస్తూ హామీలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -