Saturday, May 4, 2024
- Advertisement -

పోలీస్‌స్టేషన్‌లో కేసు న‌మోదు…త‌ర్వాత ఏమ‌య్యింది…?

- Advertisement -

పూల మార్కెట్లో వందల రకాల.. వేలకొద్ది పూలు ఉంటాయి.ఒక పువ్వు పోతే ఇంత హంగామా చేయాలా అని మీర‌నుకుంటారు.కాని అక్క‌డే ఉంది విష‌యం అంతా.పువ్వు క‌నిపించ‌క‌పోవ‌డంతో హంగామా చేశారు.పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు.దర్యాప్తు చేపట్టి మరీ ఆచూకీ కనుక్కున్నారు. వేల పుష్ఫాల్లో ఒకటి పోతే ఏమవుతుంది అనుకుంటున్నారా? దాని విలువ తెలిస్తే మీరు అవాక్క‌వ్వాల్సిందే.

చైనాలోని ఓ తైవానీస్‌ ఫ్లవర్‌ షాప్‌లో ఓ మహిళ పుష్పాన్ని కొనుగోలు చేసింది. అయితే అదీ అంతంగా బాగాలేదని అక్కడే పెట్టేసి షాపు యజమానికి చెప్పకుండానే దాని పక్కనే ఉన్న ఐరీస్‌ జపొనికా(బటర్‌ఫ్లై ఫ్లవర్‌)గా పిలిచే మరో ష్పాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత షాపులో ఐరీస్‌ జపొనికా పుష్ఫం కనిపించకపోవడంతో షాపు సిబ్బంది కంగారు పడిపోయారు. ఎందుకంటే అది చాలా అరుదైనది. ఎనిమిది సంవత్సరాలు ఎంతో కష్టపడి సేద్యం చేసి దాన్ని అభివృద్ధి చేశారు. విలువ అక్ష‌రాలా దాదాపు రూ. 20కోట్లు.దాని ఖ‌రీదు చూసి షాక్ తిన్నారా..

పుష్ఫాన్ని ఉపయోగించి అలాంటి పూల మొక్కల్నే పెంచాలని.. తద్వారా తన పూల వ్యాపారం లాభాల బాట ఎక్కించాలని యజమాని భావించాడు. ఈ పూల కోసం పలు సంస్థల నుంచి ఆర్డర్స్‌ కూడా వచ్చాయట. అయితే.. వారి వద్ద ఉన్న ఒకే ఒక్క పుష్ఫాన్ని ఆ మహిళ తీసుకెళ్లింది. దీంతో షాపు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూల దుకాణంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు ఆ పువ్వును తీసుకెళ్లిన మహిళను గుర్తించారు. ఆమె కారు నెంబరు ఆధారంగా చిరునామా కనుక్కొని ఇంటికి వెళ్లారు. ఆ పువ్వు విలువ తెలుసుకున్న తరువాత ఆ మహిళ సారీ చెప్పి పువ్వును పోలీసులకు అప్పగించడంతో దుకాణం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -