Tuesday, April 23, 2024
- Advertisement -

భూమిపై వచ్చే రాకెట్ పై క్లారిటీ ఇచ్చిన చైనా

- Advertisement -

చైనా పేరు వింటేనే పలు దేశాలు కోపంతో ఊగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ చైనా నుంచి వచ్చి ప్రపంచ దేశాలన్నింటిని కకావికలం చేస్తుందన్న ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా వల్ల మరో ఉపద్రవం ముంచుకు వస్తుందని వార్తలు వస్తున్నాయి. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొస్తున్న చైనా రాకెట్ ఎక్కడ పడుతుందో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళనగా ఉంది. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై చైనా స్పందించింది.

ఆ రాకెట్‌తో ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ మాడిమసైపోతుందని పేర్కొంది. ఈ విషయం స్వయంగా ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి గత నెల 29న కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ ఆ తర్వాత నియంత్రణ కోల్పోయింది. దాంతో అది 18 వేల మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తోంది.

నియంత్రణ కోల్పోయి భూమిపైకి వస్తున్న చైనా రాకెట్ ఎక్కడ పడుతుందో తెలియక ప్రపంచం వ్యాప్తంగా టెన్షన్ మొదలైంది. అది గనక జనావాసాల్లో పడితే అతిపెద్ద ఉపద్రవం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా పెదవి విప్పన చైనా ఈ విషయంలో అనవసర ఆందోళన అవసరం లేదని పేర్కొంది. కాగా, అత్యంత వేగంతో దూసుకొస్తున్న లాంగ్‌మార్చ్ 5బి రాకెట్ నేడే భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరోసారి మంచి మనసు చాటుకున్న సల్మాన్ ఖాన్

నేటి పంచాంగం, శనివారం (8-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -