Tuesday, May 14, 2024
- Advertisement -

అలక పాన్పు ఎక్కినా కడియం శ్రీహరి – ఏంటి కథ ?

- Advertisement -

తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అలక పాన్పు ఎక్కారు. అందుకే ఆయన నిన్నటి టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీకి డుమ్మా కొట్టారు. అయినా టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన అనతి కాలంలోనే ఆయనకు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఊహించిన దానికంటే అధిక ప్రాధాన్యమే ఇచ్చారు.

పార్టీలోకి వచ్చీరాగానే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్, ఏడాది తిరక్కముందే ఈ పదవికి రాజీనామా చేయించి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. మరి కడియం అలక పాన్పు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందనేగా మీ సందేహం? తన రాజకీయ ప్రత్యర్థి, తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం రాజయ్యకు మళ్లీ కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారట.

కడియం రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్ సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా రాజయ్య కుటుంబంలోని వ్యక్తిని బరిలోకి దింపాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారట. 

ఆది నుంచి తనకు రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగుతూ వస్తున్న రాజయ్య కుటుంబసభ్యులను తాను రాజీనామా చేసిన స్థానం నుంచి బరిలోకి దింపడం సరికాదని కడియం భావిస్తున్నారు. ఈ విషయంలో తన నిరసనను కేసీఆర్ కు తెలిపేందుకు ఆయన నిన్నటి టీఆర్ఎస్ఎల్పీ భేటీకి డుమ్మా కొట్టారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -