- Advertisement -
పెద్ద పెద్ద విగ్రహాలతో రంగ రంగ వైభోగంగా వినాయకచవితిని తొమ్మిది రోజులు చేసి నదిలో గాని సరస్సులో గాని నిమ్మజ్జనం చేస్తారు.
దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన లేకపోవటం. అలాగే ఉంచితే కొంత కాలానికి విగ్రహ రూపు రేఖలు మారవచ్చు. అది పెద్ద దోషం.
దానితో పాటు గణపతిని అలా వీధుల్లో ఉంచి పూజించటానికి దేశభక్తికి సంబందించిన ఒక కారణం ఉంది. మొదట బహిరంగంగా పూజలు చేసినవాడు బాల గంగాధర తిలక్. హిందువులు అందరూ ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని,స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయకచవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలో తెచ్చిన వాడు స్వతంత్ర యోధుడు బాల గంగాధర తిలక్.
అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశం అంతటా రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి.
