Thursday, May 16, 2024
- Advertisement -

సోనియామ్మా ప్రత్యేక హోదా అడగచ్చుగా ?

- Advertisement -

దేశం లో “మత అసహనం” రేగిపోతోంది అంటూ కాంగ్రెస్ నానా యాగీ చేస్తోంది, కొత్తగా బీజేపే అధికారం లోకి వచ్చిన నాటి నుంచీ వారిది ఇదే పంథా. ప్రణబ్ ముఖర్జీ కి ఈ విషయంలో ఫిర్యాదు కూడా చేసిన ఆమె ఆంద్ర కి ప్రత్యెక హోదా విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తించడంలేదు అంటూ ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రత్యెక హోదా విషయంలో కాంగ్రెస్ హయాం లో తెరపైకి తీసుకుని వచ్చారు , అయితే ఆప్పట్లో మాట ఇచ్చి కూడా తప్పారు వారు. 

దాన్ని బీజేపీ తో అమలు చేయించాల్సిన బాధ్యత ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షానికి కూడా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఈ విషయాన్ని మత అసహనం పట్టించుకున్నంత తీవ్రంగా పరిగణ లోకి తీసుకోవట్లేదు. తాజాగా, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ (విభజన వ్యవహారాల్ని పూర్తిగా చక్కబెట్టింది ఈయనగారే), ఏడాదిన్నర గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై నరేంద్రమోడీ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని ప్రశ్నించేశారు. 

ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు ముద్దాయిలని ఎద్దేవా చేసేశారు జైరాం రమేష్‌. ప్రత్యేక హోదా ని చాలా తెలివిగా చట్టం లో చేర్చకుండా నాటకాలు ఆడింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని చప్పాలి. అసహనం పేరితో రాష్ట్రపతి వరకూ వెళ్ళగలిగిన సోనియామ్మ గారూ .. ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా చెప్పలేక పోయారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -