పాకిస్థాన్‌పై గౌతమ్ గంభీర్ మరో సారి నిప్పులు చెరిగారు. పాకిస్థానీయులను భారత్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ఉగ్రవాదం కారనంగా పాక్, భారత్ మధ్య సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గతంలో పాక్‌ను చర్చల కోసం అనేకసార్లు భారత్ ఆహ్వానించింది. కానీ, ఏం సాధించాం? సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని, పాకిస్థానీయులను ఇండియాలో కాలు పెట్టకుండా నిషేధం విధించాలని టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
క్రికెట్ తో పాటు సినిమాలు, సంగీతం తదితర అన్ని రంగాల్లోనూ పాక్, ఇండియాల మధ్య సంబంధాలు వద్దని సూచించాడు. పరిస్థితులు కొలిక్కి వచ్చి, పాక్ కు బుద్ధి వచ్చేంత వరకూ వారిని ఇండియాలోకి రానీయకపోవడమే మంచిదని అన్నాడు.
గత సంవత్సరం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరమరణం పొందిన సైనికుల పిల్లల విద్యకు అవసరమయ్యే ఖర్చును సాయంగా అందించిన గంభీర్, గత రాత్రి వారితో కలసి డిన్నర్ చేశాడు. పాక్ రేంజర్లను సైన్యం చంపడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డ గంభీర్, సహనానికి కూడా హద్దు ఉంటుందని, శాంతి చర్చలని ఓ వైపు చెబుతూ, మరోవైపు సరిహద్దుల్లో దాష్టీకానికి దిగుతున్న పాక్ కు బుద్ధి చెప్పాలని అన్నాడు. ఈ అంశంలో రాజకీయాలకు తావివ్వరాదని సూచించాడు.
