- Advertisement -

రెండు రోజుల్లోనే యాషెస్ టెస్ట్ కంప్లీట్!

- Advertisement -

పెర్త్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. 205 ర‌న్స్ టార్గెట్‌తో పెర్త్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 28.2 ఓవ‌ర్ల‌లో టార్గ్‌ట్‌ను అందుకున్న‌ది.

ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ 69 బంతుల్లోనే సెంచ‌రీ చేయగా 83 బంతుల్లో 123 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్లు ఉన్నాయి. యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోనే ముగియ‌డం విశేషం. ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించారు.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టార్క్ ఒక్కడే ఏడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన మాస్టర్‌క్లాస్ బౌలింగ్‌తో కుప్పకూల్చాడు. స్టోక్స్ ఐదు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కేవలం 132 పరుగులకే పరిమితమైంది. అలెక్స్ కారీ చేసిన 26 పరుగులు ఆస్ట్రేలియా తరఫున అత్యధికం.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులకే ఆలౌట్ కాగా ఆస్ట్రేలియాకు 205 పరుగుల లక్ష్యం లభించింది. ఈ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. హెడ్ కేవలం 83 బంతుల్లోనే 123 పరుగులు రాబట్టగా, మార్నస్ లబుషేన్ 51 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం రెండు రోజుల్లోనే ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, యాషెస్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -