ఒకవైపు జట్టు ఓడిపోయిందనే బాధలో ఉంటే ,మరోవైపు భారత ఆటగాళ్లు ఒకరిపై మరోకరు దూషణలు చేసుకుంటు బాహబాహీకి దిగారు.పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో నాలుగో రోజు ఆటలో భారత ఆటగాళ్లు ఇషాంత్, జడేజా ఒకరి వైపు మరొకరు దూసుకొచ్చి తీవ్రంగా వాదించుకున్నారు.ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా తీవ్రంగా వాదులాడుకున్న దృశ్యాలను సిరీస్ ప్రసారకర్త ‘చానల్ 7’ బయటపెట్టింది.
ఆసీస్ బ్యాటింగ్ సమయంలో షమీ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడంతో లయన్ చికిత్స తీసుకున్నాడు.ఆ విరామంలో ఇషాంత్, జడేజాలు ఒకరిపై మరోకరు వాదనకు దిగారు.మైక్‌లు రికార్డయిన మాటలను బట్టి చూస్తే ఇద్దరూ హిందీలో బూతులు తిట్టుకున్నారు. ఒకరి వైపు మరొకరు పదే పదే వేలు చూపించడం, హావభావాలు చూస్తే ఘాటుగానే గొడవ జరిగినట్లు కనిపించింది.షమీ, కుల్దీప్ యాదవ్ జోక్యం చేసుకొని వీరిద్దరిని అడ్డుకున్నారు.
- Advertisement -
ముష్టి యుద్ధానికి దిగిన భారత ఆటగాళ్లు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
