Sunday, May 5, 2024
- Advertisement -

దినేష్ కార్తిక్ క్ బీసీసీఐ నోటీసులు…

- Advertisement -

భారత్ క్రికెటర్ దినేష్ కార్తిక్ చిక్కుల్లో పడ్డారు. కార్తిక్ కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం భారత జట్టుని సెలక్టర్లు ప్రకటించగా.. అందులో చోటు దక్కించుకోలేకపోయిన దినేశ్ కార్తీక్ తాజాగా క్రమశిక్షణ తప్పి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు.

స్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్‌)లో షారూక్‌ ఖాన్‌కి చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ టీమ్‌‌‌తో కలిసి దినేశ్ కార్తీక్ కూర్చున్న ఫొటోలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇవి వైరల్ కావడంతో దీనిపై బీసీసీఐ ఆరా తీసింది.ట్రిన్‌బాగో జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి కూడా దినేశ్ కార్తీక్ వెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కి కార్తిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న భారత క్రికెటర్.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆడటం, ఆటగాళ్లతో కలిసి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం నిషిద్ధం. నిబంధనల్ని ఉల్లఘించిన కార్తీక్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసిన బీసీసీఐ.. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -