Saturday, May 4, 2024
- Advertisement -

టెస్టులకి బుమ్రా స‌రిపోడేమో : విండీస్ మాజీ బౌలర్ మైకేల్ హోల్డింగ్…

- Advertisement -

టెస్టుల్లో బూమ్రా బైలింగ్‌పై విండీస్ మాజీ బౌలర్ మైకేల్ హోల్డింగ్ వ్యాఖ్యు లు చేశారు. పేస్‌ పిచ్‌లపై కొత్త బంతితో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడని.. విండీస్ మాజీ బౌలర్ మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో.. మ్యాచ్ ఆరంభంలోనే బుమ్రా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడని.. కానీ..ఆ నిర్ణయం సత్ఫలితాలు ఇవ్వలేదన్నాడు.

రెండేళ్లుగా భారత వన్డే, టీ20 జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా సుస్థిర స్థానం సంపాదించుకున్న బుమ్రాకి సెలక్టర్లు దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్టుల్లో తొలిసారి అవకాశం కల్పించారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ని 1-2 తేడాతో భారత్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. భారత్ జట్టు ఈ ఏడాదిలోనే ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి పిచ్‌లకి బుమ్రా బౌలింగ్ సెట్ అవదని హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు.

కొత్త బంతితో జస్‌ప్రీత్ బుమ్రా మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడని నా భావన. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కి మ్యాచ్ ఆరంభంలో కొత్త బంతితో బౌలింగ్ చేయాలంటే బుమ్రా తడబడుతున్నాడ‌న్నాడు. ముఖ్యంగా.. విదేశీ పిచ్‌లపై ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి.. నా మొదటి ఛాయిస్ ఎప్పటికీ భువనేశ్వర్ కుమార్‌.. ఆ తర్వాత ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఉంటారు. దక్షిణాఫ్రికా పిచ్‌లతో పోలిస్తే ఇంగ్లాండ్ పిచ్‌లు పూర్తిగా భిన్నం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -