Saturday, May 4, 2024
- Advertisement -

భల్లే…భల్లే బూమ్రా…

- Advertisement -

వెస్టిండీస్‌తో జమైకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు పట్టు బిగించింది. రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 264/5తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. హనుమ విహారి (111: 225 బంతుల్లో 16×4) సెంచరీ బాదడంతో 416 పరుగులకి ఆలౌటైంది. విహారితో పాటు విరాట్ కోహ్లి (76: 163 బంతుల్లో 10×4), ఇషాంత్ శర్మ (57: 80 బంతుల్లో 7×4), మయాంక్ అగర్వాల్ (55: 127 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీలు సాధించారు.

మొదటి ఇన్నీంగ్స్ ను ప్రారంభించిన విండీస్ ను బూమ్రా దెబ్బ కొట్టాడు. టీమిండియా పేస్ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్ వికెట్లతో అరుదైన ఫీట్ సాధించాడు. వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ రికార్డు సృష్టించాడు.శనివారం ఆట ముగిసే సమయానికి 87/7తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్‌కి 416 రన్స్ చేసింది. ఓవరాల్‌గా చెప్పుకోవాల్సింది ఫాస్ట్ బౌలరైన బుమ్రా గురించే. బూమ్రా దెబ్బకి విండీస్ విలవిల్లాడింది.బుమ్రా దెబ్బకి వరుసగా ఓపెనర్లు క్రైగ్ బ్రాత్‌వైట్ (10), కెంప్‌బాల్ (2), డారెన్ బ్రావో (4), బ్రూక్స్ (0), రోస్టన్‌ఛేజ్ (0), జేసన్ హోల్డ్ (18) వెనుదిరగగా.. సిమ్రాన్ హెట్‌మెయర్ (34)ని షమీ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం క్రీజులో హామిల్టన్ (2 నాటౌట్), రకీమ్ కార్న్‌వాల్ (4 నాటౌట్) ఉండగా.. భారత్ కంటే ఇంకా 329 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ వెనకబడి ఉంది. షిమ్రాన్ హేట్మెయెర్, జాసన్ హోల్టర్ కలిసి… 45 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. షమీకి 2 వికెట్లు, ఇషాంత్, జడేజాలకు ఒక్కో వికెట్‌ దక్కాయి. హెట్‌మైర్‌ (34; 7 ఫోర్లు) చేసిన ఆ కాసిన్ని పరుగులే విండీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరు.

టెస్ట్ క్రికెట్‌లో ఇండియా నుంచీ ఇది మూడో హ్యాట్రిక్‌ రికార్డు. ఇదివరకు 2001లో స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్‌ సాధించగా… 2006లో ఇర్ఫాన్‌ పఠాన్‌… పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టాడు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఫీట్ చేసి చూపించి… అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు బుమ్రా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -