Saturday, April 27, 2024
- Advertisement -

టీమిండియా వరుస విజయాలకు బ్రేక్.. కొంపముంచిన బౌలర్ !

- Advertisement -

వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు నిన్న జరిగిన రెండో టి20 మ్యాచ్ లో విండీస్ జట్టు బ్రేక్ వేసింది. సాధారణ టైమ్ కంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమయిన రెండో టి20 మ్యాచ్ లో ఉత్కంఠ రేపుతూ టీమిండియాపై 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. మొదట టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోర్ చేయడంలో విఫలం అయింది. 19.4 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ గా నిలిచింది. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో హర్డిక్ పాండ్య ( 31 బంతుల్లో 31 పరుగులు ), రవీంద్ర జడేజా ( 30 బంతుల్లో 27 పరుగులు ), రిషబ్ పంత్ ( 12 బంతుల్లో 24 పరుగులు ) రాణించగా మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంత విఫలమయ్యారు.

కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మొదటి బాల్ కే ఔట్ అయి పెవిలియన్ చేరగా, సూర్య కుమార్ యాదవ్ 11 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 10 పరుగులు, దినేష్ కార్తిక్ 7 పరుగులు, మాత్రమే చేసి వరుసగా పెవిలియన్ బాటా పట్టారు. వెస్టిండీస్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ ఏకంగా 6 వికెట్లు తీసి టీమిండియాను తక్కువ స్కోర్ పరిమితం చేయడంలో సక్సస్ సాధించాడు. ఇక ఆ తరువాత స్వల్ప చేధనతో బరిలోకి దిగిన వెండిస్ జట్టు.. ఆచి తూచి అడుగులు వేస్తూ విజయ తీరాలకు చేరింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 52 బంతుల్లో 68 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా, డేవిడ్ థామస్ 19 బంతుల్లో 31 పరుగులు, నికోలస్ పూరన్ 11 బంతుల్లో 14 పరుగులతో రాణించడంతో వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులు చేసి విజయం సాధించింది.

కొంపముంచిన ఆవేశ్ ఖాన్ ..

టీమిండియా నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్ తడబడింది. ఒకానొక టైమ్ లో టీమిండియా గెలుపుపై ఆశలు ఉన్న నేపథ్యంలో చివరి ఓవర్లో విండీస్ విజయనికి 10 పరుగులు అవసరం కాగా.. రోహిత్ శర్మ చివరి ఓవర్ ను ఆవేశ్ ఖాన్ కు ఇచ్చాడు. ఆవేశ్ ఖాన్ మొదటి బంతికే నోబాల్ వేయడంతో వెస్టిండీస్ కు ఫ్రీ హిట్ లభించింది.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా విండీస్ బ్యాట్స్ మెన్ డెవన్ థామస్ భారీ సిక్స్ బాదాడు. అదే జోరు కొనసాగిస్తూ తరువాతి బంతిని ఫోర్ గా మలచడంతో విజయం వెస్టిండీస్ ముంగిట వాలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -