నేడే రెండో టి20.. జట్టులో మార్పులు ఉంటాయా ?

- Advertisement -

వెస్టిండీస్ తో జరుగుతున్న అయిదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో నేడు రెండో మ్యాచ్ సెయింట్ కిట్స్ వేదికగా జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో విండీస్ పై భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. మరో వైపు మొదటి మ్యాచ్ ఇచ్చిన చేదు అనుభవంతో కనీసం రెండో మ్యాచ్ లోనైనా ఖాతా తెరవలని విండీస్ జట్టు ఉవ్విళ్లూరుతోంది.

ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. జట్టు కూర్పులో ఏమైనా మార్పులు ఉంటాయా ? ఉంటే ఎవరిని రీప్లేస్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జట్టులో మార్పులేమీ ఉండే అవకాశం లేదు ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, దినేష్ కార్తిక్ వంటి వారు టాప్ ఆర్డర్ లో మంచి ప్రధర్శన కనబరుస్తున్నారు.

- Advertisement -

ఇక అల్ అరౌండర్ల జాబితాలో హర్డిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్ తమదైన రీతిలో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇక బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ బౌలింగ్ లో రాణిస్తున్నారు. దాంతో జట్టు కూర్పులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.. ఒకవేళ స్పిన్నర్స్ తో ప్రయోగం చేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉంటే అశ్విన్ స్థానంలో చహల్ ను తీసుకునే అవకాశం ఉంది. కానీ అన్నీ విభాగాల్లోనూ జట్టు పటిష్టంగానే ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ప్రయోగాలు చేస్తారా ? అంటే చెప్పడం కష్టమే. ఇక ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు డీడీ స్పొర్ట్స్ లో ప్రసారం కానుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -